pre-poll survey: సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డిదే గెలుపు
According to Jan Lok Poll survey, BJP candidate Kishan Reddy is going to win in Secunderabad parliamentary constituency
- బీజేపీకి 36.77 శాతం ఓట్లు
- సిట్టింగ్ స్థానంలో మరోసారి కాషాయ రెపరెపలు
- 31.05 శాతం ఓట్లతో బీఆర్ఎస్ రెండో స్థానం
- మూడోస్థానానికి పరిమితమైన కాంగ్రెస్ పార్టీ
- జన్ లోక్ పోల్ ఒపీనియన్ సర్వేలో వెల్లడి
నా తెలంగాణ, సికింద్రాబాద్: ఎంపీ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో మరోసారి కిషన్ రెడ్డి విజయం సాధించబోతున్నారని తేలింది. 36.77 శాతం ఓట్లతో బీజేపీ సత్తా చాటనుందని ప్రముఖ జన్ లోక్ పోల్ ఒపీనియన్ సర్వేలో వెల్లడైంది. కేంద్ర మంత్రిగా, ప్రజా నాయకుడిగా కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో గత ఐదేండ్లలో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు మరోసారి ఆయనకు పట్టం కట్టబోతున్నట్లు సర్వే సంస్థ వెల్లడించింది. కాగా అధికార కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి, బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచాయి. దాదాపు 2 శాతం శాంపిల్స్ తో జన్ లోక్ పోల్ సంస్థ మార్చి 10 నుంచి ఏప్రిల్ 10 వరకు సర్వే నిర్వహించింది. వాటి ఫలితాలను విశ్లేషించి ఆదివారం ప్రకటించింది.
ప్రజానేతగా కిషన్ రెడ్డి..
2019లో సికింద్రాబాద్ ఎంపీగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా తెలంగాణతోపాటు తన పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. ఆయన పొలిటికల్ కెరీర్ లో అవినీతి మచ్చలేదు. తెలంగాణకు 30 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు మంజూరవడానికి కిషన్ రెడ్డి చొరవ చూపారు. 715 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను దేశంలో అద్భుతంగా తీర్చిదిద్దడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులతో పాటు స్థానిక ప్రజలకు అధునాతన వసతులు అందుబాటులోకి వచ్చాయి. నాలుగు వందే భారత్ రైళ్లను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించారు కిషన్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీ చారిత్రక ఆర్ట్స్ కాలేజీ నిర్మాణానికి కేంద్రం నుంచి నిధుల సమీకరణ, బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మౌలిక వసతులు, ఇతర ప్రాజెక్టులకు కేంద్రం నుంచి కిషన్ రెడ్డి పెద్ద మొత్తంలో ఫండ్స్ తెచ్చారు. నగరానికి దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రం, సైన్స్ సిటీ సెంటర్, ఎపిగ్రఫీ మ్యూజియం, నీలిట్ కేంద్రం, సంగీత, నాటక అకాడమీలను తీసుకొచ్చారు. ఇవీగాక తన ఎంపీ ల్యాడ్స్ నిధులను సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రజల అవసరాల కోసం వెచ్చించారు.
బస్తీ సమస్యల పరిష్కారం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ఎంపీ ల్యాడ్స్, వివిధ సంస్థల సీఎస్ఆర్ నిధులతో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆయా డివిజన్లలో సుమారు100 పవర్ బోర్లు ఏర్పాటు చేసి బస్తీ ప్రజలకు నీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. సీసీ రోడ్ల నిర్మాణం, కమ్యూనిటీ హాల్స్, బస్తీ దవాఖానాల్లో వసతుల కల్పన, దాదాపు అన్ని కాలనీల్లో ఓపెన్ జిమ్ ల ఏర్పాటుకు కృషి చేశారు. సికింద్రాబాద్ బోనాలు, ఇతర హిందూ పండుగలకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మహిళా సాధికారత దిశగా బాగ్‌అంబర్‌పేట్, బర్కత్‌పురాలో ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వేలాది మంది మహిళలు శిక్షణ పొందగా, ఎంతోమంది స్వయం ఉపాధి పొందుతూ తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. నల్లకుంట పీవర్ ఆసుపత్రితో పాటు యునాని హాస్పిటల్, నాంపల్లి ఏరియా హాస్పిటల్, ఎర్రగడ్డ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేశారు. పలు పబ్లిక్ హెల్త్‌కేర్ సెంటర్లకు షెడ్‌లు ఏర్పాటు చేశారు. ‘‘హెల్తీ బేబీ షో’’ కార్యక్రమాలు నిర్వహిస్తూ పిల్లలకు అందించాల్సిన పోషకాహారంపై తల్లులకు అవగాహన కల్పిస్తూ, వారికి పోషణ్ అభియాన్ కిట్లు పంపిణీ చేశారు. యువత ఆకాంక్షలు నెరవేరేలా కౌశల్ మహోత్సవ్ పేరిట జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లు, ఇతర ఉపకరణాలను పంపిణీ చేశారు. కరోనా విపత్కర సమయంలో సికింద్రాబాద్ ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించడంతోపాటు వారికి అత్యవసరమైన మందులు, ఆహారం ఇతర వసతులు కిషన్ రెడ్డి దగ్గరుండి చూసుకున్నారు. ఇలా తమ కష్ట సుఖాల్లో తోడు ఉన్న కిషన్ రెడ్డి వైపే సికింద్రాబాద్ ప్రజలు మొగ్గుచూపుతున్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులపై వ్యతిరేకత
తెలంగాణలో గత పదేండ్లు పాలించిన బీఆర్ఎస్, మూడు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన రెండు పార్టీలకు ప్రస్తుతం ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు. ఆయా నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలనే ఎంపీలుగా ఈ రెండు పార్టీలు బరిలోకి దింపుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావును ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే.. కాంగ్రెస్ పార్టీ.. బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు టికెట్ ఇచ్చింది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మళ్లీ బరిలోకి దిగుతున్నారు. ఈ ముగ్గురు అభ్యర్థుల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కోసమైనా, ఇటు రాష్ట్రం కోసమైన కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు తెచ్చే సత్తా ఉన్న నేత కిషన్ రెడ్డి ఒక్కరే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గత కొన్నేండ్లుగా సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా.. బస్తీ వాసుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారు. తాగునీరు, డ్రైనేజీ, వీధి లైట్లు, రోడ్లు, నాలాల విస్తరణ, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం తదితర అనేక సమస్యలతో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా పేదలు ఎదుర్కొంటుంటే.. ఆయన ఇల్లు దాటి బస్తీల్లోకి వెళ్లింది లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో ఒక ఎజెండా లేదు. ఎంపీగా గెలిచి పద్మారావు అదనంగా సాధించేది కూడా ఏమీ లేదు. మరోవైపు దానం నాగేందర్ పై అవినీతి, భూకబ్జాలు ఉన్నాయి. చొక్కా మార్చినంత ఈజీగా పార్టీలు మార్చే దానం.. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కావాల్సినంత కూడబెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి నెల రోజులు గడవక ముందే ఆయనపై భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తాయి. అందుకే ఆయనకు ప్రజలు ఓటు వేసేందుకు సిద్ధంగా లేరు. ఈ మేరకు ఇదే అభిప్రాయం జన్ లోక్ పోల్ సర్వేలో వెల్లడైంది.