సాగర్​ నీళ్లు ఎత్కపోయిన ఏపీ

టెయిల్​ పాండ్​ నుంచి 4 టీఎంసీలు తరలింపు – మొద్దు నిద్రలో రాష్ట్ర సర్కారు.. ముందే గుర్తించని అధికారులు – మరోసారి తెరమీదకు ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదం

Apr 20, 2024 - 16:01
 0
సాగర్​ నీళ్లు ఎత్కపోయిన ఏపీ

నా తెలంగాణ, నల్గొండ: ఇప్పటికే తాగునీటి కోసం నాగార్జున సాగర్​ కుటి కాలువ నీటిని తీసుకెళ్తున్న ఏపీ.. సాగర్ టెయిల్ పాండ్ నుంచి దొంగచాటుగా జలాలను తరలించుకుపోయింది. సాగర్ ప్రాజెక్టుకు దిగువన నల్గొండ జిల్లా అడవి దేవులపల్లి సమీపంలోని చిట్యాల దగ్గర నిర్మించిన టెయిల్ పాండ్ నుంచి ఏపీ అధి కారులు 4 టీఎంసీల నీళ్లను గుట్టు చప్పుడు కాకుండా విడుదల చేసుకున్నారు. రాష్ట్ర సర్కారు మాత్రం మొద్దు నిద్రలో ఉన్నది. ముందే గుర్తించడంలో విఫలమైన అధికారులు.. ఇప్పుడు ఏపీ నీళ్లు తరలించుకుపోయిన తర్వాత.. బోర్డుకు ఫిర్యాదు చేసే పనిలో నిమగ్నమయ్యారు. 4 టీఎంసీల నీటిని అనధికారికంగా ఏపీ వినియోగించుకోవడంపై తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం భగ్గుమంది.