త్యాగాలు స్ఫూర్తిగా సాగుదాం ఎస్పీ డా. జి.జానకి షర్మిల

Let's cultivate sacrifices as inspiration SP Dr. G. Janaki Sharmila

Oct 26, 2024 - 17:27
 0
త్యాగాలు స్ఫూర్తిగా సాగుదాం ఎస్పీ డా. జి.జానకి షర్మిల

నా తెలంగాణ, నిర్మల్: విధి నిర్వహణలో భాగంగా అమరులైన పోలీసు సిబ్బంది త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరముందని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిర్మల్ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ ని శనివారం నిర్వహించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యలయంలోని అమరవీరుల స్థూపం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మంచిర్యాల ఎక్స్ రోడ్ ఎస్పి క్యాంప్ కార్యాలయం, బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా రక్షణలో, శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతతో విధి నిర్వహణ చేస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ సైనికుల్లా ముందుకు సాగుతున్న పోలీసుల కృషి అభినందనీయమన్నారు. ప్రజా క్షేమం కోసం పని చేస్తూ అమరులైన వారి త్యాగాలను స్మరించుకునేలా ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహిస్తున్నామన్నారు. అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలతో మరింత మమేకం అవుతూ వారి మన్నలను పొందేలా విధులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తన స్వీయ రక్షణతో పాటు తన కుటుంబ క్షేమం కోసం హెల్మెట్ తప్పక ధరించాలని, వాహనదారులు ట్రాఫిక్-రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు. వాహనదారులు చేసే చిన్న చిన్న తప్పిదాల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల తో వాహనదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు అవినాష్ కుమార్, సి.ఐలు గోపినాథ్, నైలు, నవీన్ కుమార్, ప్రవీణ్ కుమార్, ప్రేమ్ కుమార్, మల్లేష్, రామకృష్ణ, రవీందర్  తదితరులు పాల్గొన్నారు.