26/11 దోషి రాణా పిటిషన్ తిరస్కరణ!
26/11 convict Rana's petition rejected!

అనారోగ్య కారణాల సాకుతో భారత్ కు అప్పగించొద్దని వాదన
తిరస్కరించిన న్యాయమూర్తి ఎలెనా కగన్
వాషింగ్టన్: 26/11 దాడుల ముంబాయి దాడుల దోషి తహవ్వూర్ రాణాను భారత్ కు అప్పగించొద్దని దాఖలైన పిటిషన్ ను అమెరికా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాణా తరఫున అతని సోదరుడు ఈ పిటిషన్ ను కోర్టులో దాఖలు చేశాడు. రాణాను భారత్ కు అప్పగిస్తే విచారణ పేరుతో హింసిస్తారని, చంపేస్తారని పేర్కొన్నారు. ఇప్పటికే రాణా అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నాడని భారత్ లో జీవించలేని పరిస్థితులు కల్పిస్తారని వాదించారు. రాణాను భారత్ కు అప్పగించే అత్యవసర నిర్ణయంపై వెంటనే స్టే విధించాలని పిటిషన్ లో కోరారు. పిటిషన్ ను విచారించిన అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎలెనా కగన్ రాణా పిటిషన్, వాదనలు అంగీకరించలేదు. పిటిషన్ ను తిరస్కరించారు. 2009లో ఎఫ్ బీఐ రాణాను అరెస్టు చేసింది. అమెరికా కోర్టులో లష్కరే తోయిబాకు మద్ధతు ఇచ్చినందుకు దోషిగా నిర్ధరించింది. ప్రస్తుతం రాణా లాస్ ఏంజెల్స్ జైలులో ఉన్నాడు. కాగా గతంలోనూ పలుమార్లు బెయిల్, భారత్ కు అప్పగించొద్దని పిటిషన్ లు దాఖలు చేసుకున్నా అమెరికలోని వివిధ కోర్టులు పిటిషన్లను కొట్టివేశాయి.
ముంబాయి దాడిలో తహవ్వూర్ రాణా పై 405 పేజీల చార్జీ షీట్ దాఖలైంది. లష్కరే తోయిబా ఉగ్రవాది. దాడిలో ప్రధాన సూత్రధారి డేవిడ్ కోల్మన్ హెడ్లీకి సహాయం చేశాడు. ఇతను పాక్ కు చెందిన వ్యాపారవేత్త. కెనడాలో స్థిరపడ్డాడు. పాక్ సైన్యంలో వైద్యుడిగా కూడా పనిచేశాడు. 1997లో కెనడాకు వెళ్లి అక్కడి ఇమ్మిగ్రేషన్ సేవలను అందించే వ్యాపారవేత్తగా పనిచేశాడు.