హెచ్​ సీఎల్​ పనితీరుపై కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి సమీక్ష

Union Minister Kishan Reddy's review on the performance of HCL

Jun 26, 2024 - 17:43
Jun 26, 2024 - 17:44
 0
హెచ్​ సీఎల్​ పనితీరుపై కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి సమీక్ష

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: హెచ్​ సీఎల్​ (హిందూస్థాన్​ కాపర్​ లిమిటెడ్​) పనితీరుపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి సమీక్షించారు. బుధవారం న్యూ ఢిల్లీలోని ఆ శాఖ కార్యాలయం శాస్త్రిభవన్​ లో హెచ్​ సీఎల్​ సీఎండీతో భేటీ అయ్యారు. సీఎండీ సంజీవ్​ కుమార్​ సింగ్​ కిషన్​ రెడ్డి ఆధ్వర్యంలో సంస్థ పనితీరుకు మరింత ఊతం లభిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. మంత్రిని కలిసిన ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆ సంస్థ పనితీరుపై అధికారులతో కలిసి సమీక్షించారు. సంజీవ్​ కుమార్​ తోపాటు సతీష్​ చంద్ర దూబే, వి.ఎల్​.కాంతారావు, సంజయ్​ లోహియా, ఇతర సీనియర్​ అధికారులతో మంత్రి కిషన్​ రెడ్డి భేటీ అయ్యారు. హెచ్​ సీఎల్​ విస్తరణ, అభివృద్ధి గురించి అడిగి తెలుసుకున్నారు. ఉత్పత్తి పెంపుదలపై మరింత దృష్టి సారించాలని మంత్రి స్పష్​టం చేశారు.