కార్మికులకు లాభాలు ప్రకటించాలి

టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ధర్నా

Sep 19, 2024 - 19:49
Sep 19, 2024 - 19:50
 0
కార్మికులకు లాభాలు ప్రకటించాలి

నా తెలంగాణ, రామకృష్ణాపూర్: సింగరేణి సంస్థ లాభాలు వెంటనే ప్రకటించి 35 శాతం వాటాను కార్మిక వర్గానికి చెల్లించాలని టీబీజీకేఎస్ మందమర్రి ఏరియా ఉపాధ్యక్షులు మేడిపల్లి సంపత్ డిమాండ్ చేశారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పిలుపుమేరకు గురువా రం మందమర్రి ఏరియా సింగరేణి జీఎం కార్యాలయం ముందు టీబీజీకేఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఏరియా జీఎంకు మోమరాండం బహిరంగ. ఈ సందర్భంగా మేడిపల్లి సంపత్ మాట్లాడుతూ సింగరేణిలో సంస్థ 2023-–24 సంవత్సరానికి 70 మిలియన్ టన్నుల ఉత్పత్తిని రికార్డు స్థాయిలో సాధించి 6 నెలలు గడుస్తున్నా లాభాలను ప్రకటించడంలో సింగరేణి యాజమాన్యం విఫలమైందని పేర్కొంది. సింగరేణి అధికారులు లాభాల వాటాను ప్రకటించక పోవడంతో కార్మికులు అయోమయానికి గురవుతున్నారు. ఎప్పటికైనా యాజమాన్యం ఈ నెల చివరివరకు కార్మికులకు 35 శాతం లాభాల వాటాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనియెడల కొత్తగూడెం, హైదరాబాద్ కార్యాలయాల ముందు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించామని అధికారులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీజీకేఎస్, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.