‘శూన్యం’తో చెక్ ట్రంప్ విధానాలకూ ఓకే
Check with 'zero', OK with Trump's policies

సిద్ధాంతాలపై ఇప్పటికే ఇరుదేశాలు సై
భారత్ లో ఇదివరకే ఈ సిద్ధాంతం అమలు
ప్రపంచదేశాల్లోనూ సమస్యలకు పరిష్కారం
మోదీ ప్రభుత్వ ముందుచూపుపై ఆశ్చర్యం
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: శూన్య సిద్ధాంతం భారతీయ విద్యలోనే గాకుండా ప్రపంచదేశాల్లోనూ ప్రాచుర్యం పొందింది. ఈ విధానం ద్వారా క్లిష్టమైన సమస్యలను కూడా అలవోకగా పరిష్కరించే ఆస్కారం ఉంది. ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే.. ట్రంప్ భారత్ పై అత్యధిక సుంకాలను విధిస్తారని, విధిస్తున్నారని, విధించొచ్చని అనేక వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మొత్తానికి ఈ సమస్యను ‘శూన్య సిద్ధాంతం’తో చెక్ పెట్టనుంది. ఏంటీ శూన్య సిద్ధాంతం. దీంతో సమస్యకు పరిష్కారం ఎలా లభిస్తుంది. ఇంతకుముందు ఎవరైనా అవలంభించారా? ఇప్పటికీ అవలంభిస్తున్నారా? ఈ సిద్ధాంతం అవలంభించడం ద్వారా లాభమా? నష్టమా? అనే ఎన్నో ప్రశ్నలు మానవాళి, ప్రపంచదేశాల ముందు ఉద్భవిస్తున్నాయి.
భారత్ లో అనేక లక్షలాది సంవత్సరాల క్రితమే ఈ శూన్య సిద్ధాంతం అనేది ఆవిర్భవించింది. ఇందుకు ఆద్యులుగా మహావీరుడు, సంగమ గ్రామ మాధవుడు, బ్రహ్మగుప్తుడు, ఆర్యభట్టు, జగద్దురు శంకారాచార్య, శకుంతల దేవి, చాణుక్యుడు, ఆచార్య రామానుజ చార్యుడు వీరంతా శూన్య సిద్ధాంతాన్ని నమ్మిన, రూపొందించిన, పరిచయం చేసిన వారిలో ప్రపంచంలోనే తొలివరుసలో నిలిచినవారు.
భారత్–అమెరికా ఇరుదేశాల మధ్య అనేక వాణిజ్య, వ్యాపార సంబంధాల్లో అనైక వైషమ్యాలు, వైరుధ్యాలు కొనసాగుతున్నప్పటికీ బలమైన బంధాలను నిర్వహించడం,కొనసాగించంలో భారత్ ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. అందుకే ట్రంప్ విధించిన సుంకాలపై ఇప్పటికే భారత్ తనకంటూ ప్రత్యేక సుంకాల ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది. దీంతో ట్రంప్ ‘వద్దన్నా.. అవునని లే’ అనే విధానాన్ని భారత్ ప్రపంచదేశాలకు మరోమారు పరిచయం చేయబోతుంది. అదే భారత్ ‘శూన్య సిద్ధాంతం–జీరో ఫర్ జీరో’ సుంకం.
భారత్ ఎగుమతులపై అమెరికా 2.9 శాతం నుంచి 4.9 శాతం వరకు అదనపు సుంకం విధించే అవకాశం ఉంది. ఇది భారత్ కు తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం పొంచి ఉంది. ‘శూన్య సిద్ధాంతం’ తో ట్రంప్ ప్రతిపాదనను ఒకే చెబుతూనే ఈ సుంకం భారత్ కు కూడా శూన్య విధానంలోనే కొనసాగనుంది. దీంతో అమెరికా విధించే సుంకాలు భారత్ కు వర్తించబోవు. ఎలా? అనే ప్రశ్న అందరి మదిలోనూ మెదలొచ్చు. వస్తువులకు బదులు వస్తువులు.. డబ్బుకు బదులు డబ్బులు.. దీంతో భారత్ కు ప్రయోజనం ఏంటీ? భారత్ కు కావాల్సిన అన్ని రకాల సాంకేతిక వస్తువులు అత్యంత అగ్గువకే (తక్కువ)కే లభించనున్నాయి. అంతేగాక భారత్ రూపొందించిన స్థానిక కరెన్సీ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. భారత్ లో వ్యవసాయ ఉత్పత్తులు దిన దిన ప్రవర్థమానంగా పెరుగుతున్నాయి. పైగా వీటి ఎగుమతులు ఒక సవాల్ గా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ విధించిన ఈ ప్రతిపాదనతో ఆహార వస్తువులకు బదులు సాంకేతిక వస్తువులను దిగుమతి చేసుకుంటే భారత్ సమస్య పూర్తిగా సమసినట్లే.
ఇప్పటికే ఈ దిశలో వాణిజ్య ఒప్పందాలు జరిగినా బయటికి వెళ్లడి కాలేదు. ఏప్రిల్ 2 నుంచి సుంకాలు తప్పవని ట్రంప్ హెచ్చరించినా భారత్ ఇంత బేఫికర్ గా కూర్చుందేంటా? అని ప్రపంచదేశాలు ఆలోచిస్తూ తమ దేశ పరిస్థితులు ఏంటని పరుగులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ‘శూన్య సిద్ధాతం’ అనేది ప్రపంచదేశాలకు అంతర్గతంగా నివేదికలు అందినట్లు తెలుస్తుంది. అంటే భారత్ ప్రపంచదేశాలతో ఎప్పుడూ ఈ విధానాన్ని అనుసరిస్తేనే అన్ని దేశాలకు మేలని తెలిపింది. ఈ నేపథ్యంలో ట్రంప్ పై పై ప్రకటనలు భారత్ కు పెద్దగా నష్టం కలిగించేదేం లేదు. ఒప్పందాలు చేసుకున్న దేశాలకూ నష్టం ఏమీ లేదు. ఒప్పందాలు చేసుకోని దేశాలకే ‘శూన్యం ‘0’(–) తో ’ నష్టమే. పరసరం భారత్–అమెరికా ఇప్పటికే ఈ సిద్ధాంతంపై పూర్తి నమ్మకం, విశ్వాసాలను కలిగి ఉన్నాయి. ఒప్పందాలు కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో భారత్ లోని ప్రతిపక్షాలు, శత్రవులు భావిస్తున్నట్లు దేశానికి వచ్చిన పెద్ద నష్టం ఏమీ లేదన్నది వాస్తవం. మొత్తానికి మోదీ ప్రభుత్వం అనుసరించిన ‘శూన్య సిద్ధాంతం’ అనేది భారత వ్యతిరేక, శత్రుదేశాలను కలవరపాటుకు గురి చేస్తుంది.