స్ఫూఫ్డ్​ కాల్స్​ లో 97 శాతం తగ్గుదల

97 percent reduction in spoofed calls

Apr 2, 2025 - 16:30
 0
స్ఫూఫ్డ్​ కాల్స్​ లో 97 శాతం తగ్గుదల

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సైబర్​ క్రైమ్​ ఫిర్యాదులు దేశవ్యాప్తంగా 19 లక్షలను దాటాయని స్ఫూఫ్డ్​ కాల్స్​ లో 97 శాతం తగ్గుదల నమోదైందని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్​ శాఖలు బుధవారం ఓ ప్రకటనలో తెలిపాయి. 2024కు సంబంధించి ఎన్సీఆర్పీ (నేషనల్​ సైబర్​ క్రైమ్​ రిపోర్టింగ్​ పోర్టల్​ లో సైబర్​ నేరాలకు సంబంధించిన 19.18 లక్షలకు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయని, వీటివల్ల రూ. 22,811.95 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని కమ్యూనికేషన్​స్​ అండ్​ గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్​ పెమ్మసాని చంద్రశేఖర్​ తెలిపారు. టెలికాం సర్వీస్​ ప్రొవైడర్ల సహకారంతో టెలికాం మోసాలను అరికట్టేందుకు డాట్​, అంతర్జాతీయ స్ఫూఫ్డ్​ కాల్​ లను గుర్తించి బ్లాక్​ చేయడానికి ఒక వ్యవస్థను ప్రారంభించింది. ప్రారంభించిన 24 గంటల్లోనే 1.35 కోట్ల మోసపూరిత కాల్​ లను బ్లాక్​ చేశామన్నారు. 2025 మార్చి నాటికి బ్లాక్​ కాల్​ ల సంఖ్య 4 లక్షలకు తగ్గిందని 97 శాతం తగ్గుదల సూచిస్తుందని చెప్పారు.