కరీంనగర్​ లో బండి స్పీడ్​

The Lok Poll organization revealed that Bandi Sanjay will win the seat of Karimnagar MP

Apr 8, 2024 - 16:15
 0
కరీంనగర్​ లో బండి స్పీడ్​
  •  ఎంపీ స్థానం మళ్లీ బీజేపీదే

  •  జన లోక్​ పోల్​ సర్వేలో వెల్లడి

  •  కమలం పార్టీకి 41.90 శాతం ఓట్లు

  • దరిదాపుల్లో లేని ప్రతిపక్షాలు

  •  28.25 శాతానికే పరిమితమైన కాంగ్రెస్​

  •  బీఆర్​ఎస్​ పార్టీకి 26.62 శాతం ఓట్లు

నా తెలంగాణ, కరీంనగర్​: మరోసారి కరీంనగర్​ గడ్డ మీద ఎగిరేది కాషాయ జెండానేని తేలిపోయింది. బీజేపీ నేత బండి సంజయ్​ ఎంపీగా విజయం సాధించబోతున్నారని జన లోక్​ పోల్​ సర్వే వెల్లడించింది. కాగా అధికార కాంగ్రెస్​ పార్టీ, ప్రతిపక్ష బీఆర్​ఎస్​ బీజేపీకి దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం.

సంజయ్​ కు తగ్గని ఆదరణ

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్​ కు ప్రజల్లో ఆదరణ ఏ మాత్రం తగ్గలేదని జన లోక్​ పోల్​ సర్వే ద్వారా వెల్లడైంది. దాదాపు 41.90 శాతం ఓటు షేర్​ తో సంజయ్​ ఎంపీగా గెలవబోతున్నారని సర్వే సంస్థ వెల్లడించింది. కరీంనగర్​ పార్లమెంట్​ నియోజకవర్గం పరిధిలో మెజార్టీ అసెంబ్లీ స్థానాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీఆర్​ఎస్​ పార్టీలు కమలం పార్టీకి సమీపంలో కూడా లేవు. 28.90 శాతం ఓట్లతో కాంగ్రెస్​ బీజేపీ తర్వాత రెండో స్థానంలో ఉండగా, 26.62 శాతం ఓట్లతో బీఆర్​ఎస్​ మూడో స్థానంలో నిలిచింది. 

అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్​..

ఇప్పటికే కరీంనగర్​ లోక్ సభ స్థానంలో ప్రధాన బీఆర్ఎస్, బీజేపీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకు ఎంపీ అభ్యర్థిని ప్రకటించలేదు. బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ రంగంలోకి దిగుతుండగా, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్​ పార్టీకి అక్కడ అభ్యర్థి దొరకని పరిస్థితి నెలకొంది. ఉత్తర తెలంగాణలోనే కరీంనగర్ ఎంపీ సీటు ముఖ్యమైనది. కాగా అటు కాంగ్రెస్​, ఇటు బీఆర్​ఎస్​ బీజేపీకి పోటీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని తేలిపోయింది. బండి సంజయ్ ప్రజాహిత యాత్ర పేరుతో మరోసారి గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు. నియోజకవర్గంలోని ఒక్కో ప్రాంతంలో పర్యటిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. అటు రైతు సమస్యలపైనా పోరాటం కొనసాగిస్తున్నారు.