మస్క్ ద్వేషపూరిత ప్రసంగాలు పెరిగాయి
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ నివేదిక వెల్లడి

నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ఎలన్ మస్క్ ‘ఎక్స్’కు సీఈవో అయ్యాక, అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టాక ఆయన ద్వేష పూరిత ప్రసంగాలు బాగా పెరిగాయని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ నివేదిక శుక్రవారం పేర్కొంది. గత నెలలో ఈ ప్రసంగాల తీరులో మరింత ఘాటు ఎక్కువైందని తెలిపింది. ఎక్స్ కొనుగోలు చేశాక ద్వేషపూరిత ప్రసంగాలు 50 శాతం పెరిగినట్లు గుర్తించాము అదే సమయంలో విమర్శలు, ఆరోపణలు కూడా వెల్లువెత్తాయని స్పష్టం చేశారు. స్పామ్ బాట్ లను తొలగిస్తామని మస్క్ ప్రకటించారు. ప్రసంగాలు, అభిప్రాయాలలో జాత్యహంకారం, స్వలింగ సంపర్కం, ట్రాన్స్ ఫోబియా లాంటి విషయాలున్నాయని తెలిపారు. కుంభకోణాలు, ఎన్నికలలో జోక్యం, ప్రజలకు తప్పుడు సందేశాలిచ్చేలా ఉన్నాయని చెప్పింది. ఆయా విషయాలపై ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ పై తీవ్ర ఆందోళనలు, నిరసనలు కూడా చెలరేగాయని చెప్పారు. మస్క్ విధానం పట్ల ఆన్ లైన్ ద్వారా నిర్వహించే సామాజిక మాధ్యమాలపై వీటి ప్రభావం పడుతుందని స్పష్టం చేసింది. ఈయన అభిప్రాయాలతో భారీ నష్టం కూడా ఏర్పడిందని, పర్యావరణ శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు, విధానపరమైన నిర్ణేతలు ఆయా విషయాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ నివేదిక తెలిపింది.