మహాకుంభమేళాతో రూ. 3 లక్షల కోట్ల ఆదాయం

సీఎం యోగి ఆదిత్యనాథ్​ 

Feb 14, 2025 - 18:37
 0
మహాకుంభమేళాతో రూ. 3 లక్షల కోట్ల ఆదాయం

లక్నో: మహాకుంభ మేళా నిర్వహణ వల్ల వందల ఏళ్లుగా అణచివేయబడిన ప్రజల మనోభావాలను గౌరవించామని, దీంతో యూపీ ఆర్థిక వ్యవస్థ సమూల మార్పు చెందుతుందని ఉత్తరప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​ అన్నారు. శుక్రవారం ప్రయాగ్​ రాజ్​ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో యోగి మాట్లాడారు. కుంభమేళా నిర్వహణకు రాష్​ర్టం రూ. 1500 కోట్లు ఖర్చు చేస్తే రూ. 3 లక్షల కోట్లు తిరిగి వస్తుందని అన్నారు. ఇంతపెద్ద సనాతన కార్యక్రమం ప్రపంచ చరిత్రలోనే ఎప్పుడూ కనివినీ జరగలేదని, ఎవ్వరూ ఊహించని విధంగా నిర్వహించామని అన్నారు. ఈ మహాకుంభమేళా ద్వారా దేశ విదేశాల్లోనూ యూపీ పేరు మారుమ్రోగిపోతుందన్నారు. 70 దేశాల నుంచి భక్తులు తండోపతండాలుగా విచ్చేశారన్నారు. దేశాధ్యక్షులు, ప్రముఖ వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు, సినీ, సాంస్కృతిక ఇలా అన్ని వర్గాల వారు మహాకుంభమేళాలో స్నానం ఆచరించి పుణ్యం మూటగట్టుకున్నారని అన్నారు. వచ్చిన వారంతా యూపీలోని ప్రముఖ దేవాలయాలను కూడా సందర్శించారని అన్నారు. కళ్యాణ్​ పూర్​ ఫ్లై ఓవర్​ కు రూ. 270 కోట్లు, చౌరాహా ఫ్లై ఓవర్​ కు రూ. 170 కోట్లు, 114 ప్రాజెక్టులకు రూ. 588 కోట్లు, కేంద్రం ఆధ్వర్యంలో లక్నోకు రూ. 1000 కోట్ల ప్రాజెక్టులు, రూ. 440 కోట్ల జాతీయ రహదారి ప్రాజెక్టులు, రూ. 600 కోట్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల ప్రాజెక్టులు అందాయన్నారు. రోడ్డు, రైలు, వాయు మార్గాల అద్భుతమైన కనెక్టివిటీ సాధ్యపడిందన్నారు. దేశంలోని ప్రయాగ్​ రాజ్​ లో 40 విమానాల ద్వారా రాకపోకలు కొనసాగాయన్నారు. వందలాది రైళ్లు, వేలాది రవాణ వ్యవస్థ బస్సులను తిప్పామన్నారు. మహాకుంభమేళా సనాతన, హిందూ ధర్మానికి గొప్ప విశ్వాస పర్వదినమని సీఎం యోగి ఆదిత్యనాథ్​ స్పష్టం చేశారు.