వచ్చే వారమే సీఈసీ నియామకం
ప్రధాని నేతృత్వంలోని ఎంపిక ప్యానెల్ భేటీలో నిర్ణయం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) నియామకం వచ్చే వారం జరిగే అవకాశం ఉన్నట్లు ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం ఈ విషయంపై ఎన్నికల కమిషన్ పలువురు అధికారులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏతృత్వంలోని ఎంపిక కమిటీ వచ్చే వారం సమావేశం కానుందన్నారు. ఎంపిక ప్యానెల్ సీఈసీ పేరును ఖరారు చేస్తుందన్నారు. ఈ ప్యానెల్ లో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి నామినేట్ చేసిన కేంద్ర క్యాబినెట్ మంత్రి ఉంటారు. ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నందున, ఆదివారం లేదా సోమవారం కమిటీ సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఈ కమిటీ ఒక పేరును సిఫార్సు చేస్తుంది. దీని తరువాత రాష్ట్రపతి సిఫార్సు ఆధారంగా తదుపరి సీఈసీని నియమించనున్నారు. కాగా రాజీవ్ కుమార్ తరువాత అత్యంత సీనియర్ గా ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈయన పదవీ కాలం 2029 జనవరి 25 వరకు ఉంది. ఈయన తరువాత మరో ఎన్నికల కమిషనర్ సుఖ్ బీర్ సింగ్ సంధు రెండో వరుసలో ఉన్నారు. ఇప్పటివరకూ అత్యంత సీనియర్ లకు మాత్రమే ప్రధాన ఎన్నికల కమిషనర్ గా నియమించారు. కాగా గత సంవత్సరమే ఎన్నికల కమిషనర్ల నియామకాలపై కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. దీని కింద ప్రధానమంత్రి నేతృత్వంలోని కమిటీ వారిని పరిగణనలోకి తీసుకునేలా ఈ పదవులకు నియామకం కోసం ఐదుగురు కార్యదర్శి స్థాయి అధికారుల పేర్లను సెర్చ్ కమిటీ షార్ట్ లిస్ట్ చేసింది.