పరారే.. పరారే.. పాక్ ఆర్మీ చీఫ్ కుటుంబం న్యూజెర్సీకి
Pakistan Army Chief's family to New Jersey

అధికారులు, నాయకుల కుటుంబాలకు విదేశాలకు
మోదీ వార్నింగ్ తో పాక్ లో ప్రైవేట్ జెట్ లకు పెరిగిన గిరాకీ
ఇస్లామబాద్: పహల్గామ్ దాడి.. మోదీ వార్నింగ్ తరువాత పాక్ వెన్నులో వణుకుపుడుతుంది. ఈ నేపథ్యంలో పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు సైతం తమ తమ కుటుంబాలను విదేశాలకు గుట్టుచప్పుడు కాకుండా పంపించేస్తున్నారు. అంతేందుకు బీరాలు పోయిన ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ సైతం తన కుటుంబాన్ని విదేశాలకు పంపించేశాడు. ఇందుకోసం ప్రభుత్వ విమానాలను ఆశ్రయిస్తే మీడియాకు, ప్రపంచానికి విషయాలు బయటికి పొక్కుతాయని భావించి ప్రైవేట్ జెట్ లను ఆశ్రయిస్తున్నారు. మోదీ వార్నింగ్ తరువాత పాక్ లో జెట్ విమానాలకు భారీ గిరాకీ ఏర్పడినట్లు తెలుస్తుంది. మునీర్ తన కుటుంబాన్ని న్యూ జెర్సీకి పంపించేశారు. ఎలాగో భారత్ తీసుకున్న, తీసుకుంటున్న నిర్ణయాలతో అగాధంలో ఉన్న పాక్ ఆర్థిక వ్యవస్థ పట్టుమని పదిక్షణాలు కూడా నిలవలేదన్న పరిస్థితి.. ఇంకా యుద్ధం మొదలు కాకముందే వీరి చర్యలను చూస్తే అర్థం అవుతుంది. కాగా ఈ విషయాలు లీక్ కావడంతో మునీర్ పై సోషల్ వ్యాప్తంగా జోకులు పేలుస్తూ పరారే.. పరారే అనే పాటలు వినిపిస్తున్నాయి.