రెండు గూడ్స్​ రైళ్లు ఢీ డ్రైవర్​​, కో పైలెట్​ కు తీవ్ర గాయాలు

Two goods trains hit the driver and co-pilot with serious injuries

Feb 4, 2025 - 12:56
 0
రెండు గూడ్స్​ రైళ్లు ఢీ డ్రైవర్​​, కో పైలెట్​ కు తీవ్ర గాయాలు

లక్నో: యూపీలోని ఫతేపూర్​ లో ఒకే ట్రాక్​ పై రెండు గూడ్స్​ రైళ్లు ఢీకున్నాయి. మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్​, కో పైలెట్​ లకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంతో ఒక గూడ్స్​ రైలు ఇంజిన్​ పూర్తిగా పట్టాలు తప్పి తీవ్రంగా ధ్వంసమైంది. ప్రమాదంపై ఖాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన డ్రైవర్​, కో పైలెట్​ లను ఆసుపత్రికి తరలించి చికిత్సనందింప చేస్తున్నారు.