డిప్యూటీ సీఎంకు సుప్రీం ఊరట!

Supreme relief to Deputy CM!

Mar 6, 2025 - 13:35
 0
డిప్యూటీ సీఎంకు సుప్రీం ఊరట!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్​ కు సుప్రీంలో ఊరట లభించింది. గురువారం కేసును విచారించిన కోర్టు కేసు నమోదు చేయమని తెలిపింది. కోర్టు అనుమతి లేకుండా కేసు నమోదు చేయబోమని చెప్పింది. బిహార్​ పై చేసిన వ్యాఖ్యల కేసుపై సుప్రీం ఉదయనిధికి నోటీసులు జారీ చేసింది. 2023లో సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై మహారాష్​ర్ట, బిహార్​, జమ్మూ, కర్నాటక సహా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఎఫ్​ ఐఆర్​ లు నమోదయ్యాయి. మరోవైపు తమిళనాడు డీ లిమిటేషన్​ ప్రక్రియపై జరిగే అఖిలపక్ష సమావేశంలో బీజేపీ పాల్గొనదని అన్నామలై ప్రకటించారు.