ప్రేమోన్మాది చేతిలో యువతి హత్య

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం కసబ్ గల్లిలో గురువారం దారుణం జరిగింది. ప్రేమోన్మాది చేతిలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది.

Feb 8, 2024 - 16:57
 0
ప్రేమోన్మాది చేతిలో యువతి హత్య


నా తెలంగాణ, నిర్మల్​: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం కసబ్ గల్లిలో గురువారం దారుణం జరిగింది. ప్రేమోన్మాది చేతిలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం. ఖానాపూర్ కు చెందిన ఓ యువతి రోజూలాగే టైలరింగ్​ నేర్చుకునేందుకు వెళ్తుండగా ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. తనతో పెళ్లికి నిరాకరించిందని అతను ఆగ్రహంతో ఈ పని చేసినట్లు తెలుస్తున్నది. తీవ్ర రక్త స్రావం జరిగి యువతి అక్కడికక్కడే మృతి చెందింది. కాగా అతడిని అడ్డుకునేందుకు వచ్చిన మరో ఇద్దరిపైనా దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే 108లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఖానాపూర్ పోలీసులు పరిశీలించారు. యువతి హత్యపై దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం వెతుకుతున్నారు.