పాలసీ రేటు తగ్గేనా?

ఎంపీసీ సమావేశం ప్రారంభం

Sep 29, 2025 - 14:15
 0
పాలసీ రేటు తగ్గేనా?
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆర్​ బీఐ ఎంపీసీ సమావేశం (ద్రవ్య పరపతి సంఘం) సోమవారం ప్రారంభమైంది. పాలసీ రేటును 0.25 శాతం తగ్గిస్తారా? లేదా? అనే దానిపై దేశవ్యాప్తంగా ఆశలు నెలకొన్నాయి. ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నందున పాలసీ రేటును తగ్గించే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ ఎంపీసీ సమావేశం అక్టోబర్​ 1 వరకు కొనసాగనుంది. కాగా సమావేశంలోని నిర్ణయాలను సోమవారమే ప్రకటించనున్నారనే ఆశావహులు భావిస్తున్నారు. ఈ సమావేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, వృద్ధిని పెంచడం మధ్య సమతుల్యతలను సాధించడంపై కమిటీ చర్చిస్తుంది. అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం ఆర్బీఐ గవర్నర్​ సంజయ్ మల్హోత్రా సమావేశ ఫలితాన్ని బుధవారం వెల్లడించనున్నారు. 
 
గత ఆగస్టులో జరిగిన విధాన సమావేశంలో, రిజర్వ్​ బ్యాంక్​ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) రెపో రేటును 5.5 శాతం నుంచి మార్చలేదు. కాగా దేశీయంగా ప్రధాన బ్యాంకు ఎస్​ బీఐ 0.25 బేసిస్​ పాయింట్ల రేటు తగ్గింపును ఆశిస్తుంది. దీంతో వడ్డీరేట్లు మరింత తగ్గే అవకాశం ఉంది. యూబీఐ (యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా) 0.25 బేసిస్​ పాయింట్ల రేట్లను తగ్గిస్తుందని అంచనా వేస్తుంది. 
 
కాగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ రేటు తగ్గుదల సవరణపై ఆధారపడి ఉంటుంది. ఈసారి రేటు నిర్ణయం మాత్రమే కాకుండా, కమిటీ కమ్యూనికేషన్​ కూడా కీలకం కానుంది.