తొక్కిసలాట బాధితులను పరామర్శించిన కేంద్రమంత్రి
Union Minister visits stampede victims
చెన్నై: కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాన్ని సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పరామర్శించారు. పరామర్శలో స్థానిక బీజేపీ చీఫ్ నైనాన్ నాగేంద్రన్ కూడా ఉన్నారు. ప్రియమైన వారిని కోల్పోవడం అత్యంత బాధాకరమని నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కూడా పరామర్శించారు. బాధితులకు ధైర్యం చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని అధైర్యపడవద్దన్నారు. పలువురు వైద్యులు బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వేదిక వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో విషాదం చోటు చేసుకుందని, ఆ సమయంలో తమకేం అర్థం కాలేదని పలువురు బాధితులు మంత్రితో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా బాధితులకు అండగా ఉంటుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వారికి ధైర్యం చెప్పారు. కాగా కేంద్ర ప్రభుత్వం తరఫున మృతిచెందిన వారికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేలు పరిహారం ప్రకటించారు.