నిధులు కేటాయించాలి కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి

Union Minister G. Kishan Reddy should allocate funds

Sep 14, 2025 - 14:05
 0
నిధులు కేటాయించాలి కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి

షేక్​ పెట్​ లో కమ్యూనిటీ హాల్​ నిర్మాణానికి శంకుస్థాపన
స్థానిక సమస్యలను పరిష్​కరించాలని అధికారులకు ఆదేశం
ఆర్థిక సంక్షోభంలో జీహెచ్​ ఎంసీ

నా తెలంగాణ, హైదరాబాద్​: హైదరాబాద్​ కు వచ్చే రెవెన్యూను దృష్టిలో పెట్టుకొని ప్రజాసమస్యల పరిష్​కారానికి మరిన్ని నిధులను రాష్​ర్ట ప్రభుత్వం కేటాయించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం జూబ్లీహిల్స్​ షేక్​ పేట్​ లో డివిజన్​ లో పర్యటించారు. మారుతీనగర్​ లోని నూతన కమ్యూనిటీ హాల్​ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలువురు బస్తీ వాసులతో ముచ్చటించారు. స్థానిక సమస్యలపై మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత అధికారులతో ఆయా సమస్యలను పరిష్​కరించాలని ఆదేశించారు. భాగ్యనగరంలో బస్తీల అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు. రాష్​ర్ట ప్రభుత్వం అవసరమైన మేరకు నిధులను కేటాయించడం లేదని ఆరోపించారు. నగరంలో వీధి లైట్లు వెలగని పరిస్థితులున్నాయని, జీహెచ్​ ఎంసీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని విమర్శించారు. రాజధాని నగరంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి సాధిస్తేనే, మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే రాష్ర్టం బాగుంటుందన్నది ప్రభుత్వం గుర్తెరగాలన్నారు. ఇందుకోసం నగరంలోని నిరుపేదలు, మధ్యతరగతి వారు ఉంటున్న బస్తీలలో మౌలిక సదుపాయాల కల్పనకు మరిన్ని నిధులను రాష్ర్ట ప్రభుత్వం కేటాయించాలని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.