భారత్​–భూటాన్​ రెండు రైల్వే ప్రాజెక్టులు

కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్​ ప్రకటన

Sep 29, 2025 - 17:26
 0
భారత్​–భూటాన్​ రెండు రైల్వే ప్రాజెక్టులు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్​–భూటాన్​ మధ్య రెండు నూతన రైలు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఇరుదేశ ప్రభుత్వాలు బనార్హత్​ (పశ్చిమ బెంగాల్​)ను సామ్త్సేతో కోక్రాఘర్​ (అసోం)ను గెలేపుతో అనుసంధానించే రెండు క్రాస్ బోర్డర్​ రైలు లింక్​ లను ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​, విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులకు రూ. 4,033 కోట్లు ఖర్చు చేయనున్నామన్నారు. భారత్​–భూటాన్​ పరస్పర గౌరవం, విశ్వాసం, అవగాహనతో కూడిన సంబంధాన్ని పంచుకుంటున్నాయన్నారు. గత సంవత్సరం ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్​ పర్యటన సందర్భంగా రైలు లింక్​ ఏర్పాటు ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ప్రాజెక్టులు భారత రైల్వే నెట్‌వర్క్‌తో ప్రారంభమవుతాయని వైష్ణవ్ పేర్కొన్నారు. సుమారు రూ. 4,033 కోట్ల పెట్టుబడి ప్రతిపాదించబడిందని ఆయన పేర్కొన్నారు. ఈ చొరవ కింద 89 కిలోమీటర్ల పొడవైన రైల్వే నెట్‌వర్క్ నిర్మించబడుతుందని రైల్వే మంత్రి పేర్కొన్నారు.