విత్తనం చెట్టయ్యింది

ప్రధాని నరేంద్ర మోదీ

Sep 29, 2025 - 19:10
 0
విత్తనం చెట్టయ్యింది
ప్రజలకు బీజేపీకి మధ్య సేవా, సంస్కృతి సంబంధం
ఆశయాలను నేరవేర్చేందుకు పనిచేస్తాం
ఎమర్జెన్సీలో ప్రజల పక్షాన నిలిచాం
1984లో సిక్కులను కాపాడాం
జీఎస్టీని సంస్కరించాం
హిమాచల్​ ప్రభుత్వం సిమెంట్​ ధరలను పెంచడమేంటీ?
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: బీజేపీ స్థాపించి 45 ఏళ్లయ్యిందని విత్తనంగా ఉన్న పార్టీ నేడు పెద్ద చెట్టయ్యిందని, ఢిల్లీ, బీజేపీకి మధ్య సంబంధం కేవలం ఒక నగరం, పార్టీ సంబంధం కాదని, సేవా, సంస్కృతి సంబంధమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీ ప్రజాప్రయోజనాలకు కట్టుబడి ఉంటామన్న నమ్మకంతోనే ప్రజలు తమకు అధికారాన్ని అప్పగించారన్నారు. వారి ఆశలు, ఆశయాలను నేరవేర్చేందుకు బీజేపీ శక్తివంచన లేకుండా పనిచేస్తుందన్నారు. 
 
భారత నిర్మాణంలో భాగస్వామ్యమైదాం..
సోమవారం ఢిల్లీలో నూతన బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. పవిత్ర నవరాత్రి రోజుల్లో కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.  డాక్టర్​ శ్యామా ప్రసాద్​ ముఖర్జీ నాయకత్వం జన సంఘ్​ కు పునాది వేయడాన్ని గుర్తు చేశారు. దశాబ్దాలుగా పార్టీ బలోపేతానికి అనేకమంది కార్యకర్తలు కృషి చేశారని కొనియాడారు. ఎమర్జెన్సీలోనూ జనసంఘ్​ పోరాట పటిమను వివరించారు. 1984లోనూ సిక్కు సోదరులను బీజేపీ రక్షించిందని గుర్తు చేశారు. అనేక పోరాటాల్లో బీజేపీ ప్రజలతో మమేకమై నిలుస్తూ పోరాడిందని వివరించారు. ఢిల్లీ ప్రజల మెరుగైన భవిష్యత్​ కోసం బీజేపీ పనిచేస్తుందన్నారు. అభివృద్ధి చెందిన భారత్​ నిర్మాణంలో ఢిల్లీని భాగస్వామ్యం చేసుకుందామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 
 
జీఎస్టీ సంస్కరణతో ప్రతీ ఒక్కరికీ లబ్ధి..
దేశంలోని ప్రతీఒక్కరికీ లబ్ధి చేకూరాలన్న లక్ష్యంతోనే జీఎస్టీని సంస్కరించామని సామాన్యులకు ప్రయోజనాలు చేకూరేలా ప్రతీఒక్క కార్యకర్త చర్యలు తీసుకోవాలన్నారు. అధికారంలో ఉన్న చోట, ప్రతిపక్షంలో ఉన్నచోట అని గాకుండా అన్నిచోట్ల మన లక్ష్​యం సామాన్యులకు మేలు చేయడమే లక్ష్యంగా ఉండాలన్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించగానే హిమాచల్​ ప్రభుత్వం సిమెంట్​ ధరలను పెంచిందని, ప్రజల హక్కులను దోచుకోవడం ప్రారంభించిందని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ప్రధాని మద్దతుకు కృతజ్ఞతలు: జేపీ నడ్డా..
సుధీర్ఘ నిరీక్షణ తరువాత ఢిల్లీలో బీజేపీకి ఎట్టేకేలకు సొంత కార్యాలయం లభించిందని కేంద్రమంత్రి జేపీ నడ్డా అన్నారు పార్టీని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషకరమైన విషయమన్నారు. పార్టీకోసం పనిచేసే సమయంలో మార్గదర్శకత్వం కోరినప్పుడల్లా ఎల్లప్పుడూ ప్రధాని నరేంద్ర మోదీ మద్ధతు లభించిందని ఇందుకు ప్రధానికి హృదయపూర్వక కృతజ్ఞలు తెలిపారు.