అన్ని పథకాల్లోనూ తెలంగాణకు వాటా
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి

రాష్ట్ర బడ్జెట్ కాదు.. కేంద్ర బడ్జెట్
విపక్షాలు గుర్తించాలి, తెలుసుకోవాలి
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కేంద్రం విడుదల చేసిన 2025–26 బడ్జెట్ లో అన్ని రాష్ర్టాలతోపాటు తెలంగాణకు వాటా ఉంటుందని, ఇది రాష్ర్ట బడ్జెట్ కాదని, కేంద్ర బడ్జెట్ అని తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం కేంద్ర బడ్జెట్ విడుదల అనంతరం సాయంత్రం న్యూ ఢిల్లీలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
12వ పూర్తి స్థాయి బడ్జెట్..
గత మూడేళ్లలో పూర్తిస్థాయి బడ్జెట్ అని, ప్రధానిగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక 12వ పూర్తి స్థాయి బడ్జెట్ అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చాక దేశంలో అనేక సంస్కరణలు, కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నాని చెప్పారు. దేశ అభివృద్ధిలో తీసుకున్న నిర్ణయాల ఫలితాలు లభిస్తున్నాయని పేదరిక, విద్యారంగ మౌలిక సదుపాయాల మెరుగుదల ఫలితాలను చూస్తున్నామన్నారు. ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రత్యేకమైనదని తెలిపారు. ఇది పూర్తిగా మధ్య తరగతి ప్రజలకు సమర్పించిన ఆకాంక్ష పూరితమైన, వారి కలలను నిజం చేసే బడ్జెట్ అన్నారు. పేదలు, యువకులు, రైతులు, మహిళల అభివృద్ధి లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకొని ప్రవేపెట్టిన బడ్జెట్ అన్నారు.
ఆదాయపు పన్ను పెద్ద నిర్ణయం హర్షణీయం..
వికసిత్ భారత్ 2047లో అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న లక్ష్యంతో మూడోసారి అధికారంలోకి వచ్చాక తొలి అడుగు వేశామన్నారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిధి రూ. 2 లక్షల నుంచి రూ. 12 లక్ష్లల వరకు ఎవరూ ఊహించని విధంగా పెద్ద నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుందన్నారు. గత 20 ఏళ్లుగా ప్రతీ బడ్జెట్ లో ప్రధానమైన చర్చ వ్యక్తిగత ఆదాయపు పన్నుపైనే ఉండేదన్నారు. దీంతో చిన్న వ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగుల కలలు నెరవేర్చేందుకు ప్రధాని కట్టుబడి ఉన్నారని తెలిపారు. కేంద్రానికి ఆదాయం తగ్గినా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకున్న నిర్ణయం అన్నారు.
కరోనాను నెట్టుకొని ఆర్థికాన్ని గాడిన పెట్టాం..
కరోనా కష్టకాలంలో ఆర్థిక వ్యవస్థ మందగించింది. అనేక దేశాల్లో ఆర్థిక సంక్షోభలు తలెత్తాయి. ఆర్థిక ఎమర్జెన్సీని ఏర్పాటు చేశాయి. పాక్ లాంటి దేశాలైతే ఆర్థికంగా పూర్తిగా కుప్పకూలాయి. మరికొన్ని దేశాలు యుద్ధాల కారణంగా ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాయన్నారు. అనేక సమస్యలున్నా దేశ ఆర్థిక సమస్యను గాడిన పెట్టే చర్యలకు ప్రధాని మోదీ అధిక ప్రాధన్యతిచ్చారని తెలిపారు. మెరుగైన పనితీరు ప్రదర్శనతో భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టగలిగడం అభినందనీయమన్నారు.
అన్ని పథకాల్లోనూ తెలంగాణకు వాటా..
తెలంగాణకు ఏమిచ్చారని ప్రశ్నించే వారు తెలుసుకోవాల్సినవి ఉన్నాయని తెలిపారు. మరోసారి వివరిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కేంద్ర బడ్జెట్ లో 95 శాతం అన్ని పథకాలలో తెలంగాణ కూడా భాగమేనని తెలుసుకోవాలన్నారు. తెలంగాణకు వచ్చే ఐదేళ్లలో 1.50 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతుందన్నారు. 10 లక్షలకు పైగా ఎంఎస్ ఎంఇలు ఉన్నాయని, ఇందులో తెలంగాణకు వాటా ఉందన్నారు. 27 రంగాలలో స్టార్టప్ కంపెనీలు 10వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణకు వాటా దక్కుతుందన్నారు. తెలంగాణకు రావల్సిన నిధులు కూడా వస్తాయన్నారు. దీంతోపాటు రాష్ర్టాల పన్నుల వాటా శాతం వస్తుందన్నారు.
తెలంగాణ అర్బన్ కు రూ. 10వేల కోట్లు..
కేంద్ర ప్రభుత్వం ఏ పథకం తీసుకువచ్చినా పథకాల లబ్ధి చేకూరుతుందన్నారు. నిధుల వాటాలను కూడా పెంచారన్నారు. తెలంగాణ అర్బన్ ప్రాంతాలకు రూ. 10వేల కోట్లు రాబోతుందన్నారు. అమృత్ పథకానికి కూడా 125 అర్బన్ లోకల్ బాడీస్ కు లబ్ధి చేకూరనుందన్నారు. దీంతో వీధి వ్యాపారులకు మేలు జరుగుతుందని, పీఎం స్వానిధి ద్వారా లబ్ధి చేకూరనుందన్నారు. హైదరాబాద్, వరంగల్ లాంటి నగరంలో ఉన్న యువతకు మేలు చేకూర్చే ఈ శ్రమ్ పోర్టల్ కింద కార్మికులకు లబ్ధి చేకూరుతుందన్నారు. నేషనల్ జియోస్పెషియల్ మిషన్ కింద భూ రికార్టులను ఆధునీకరించనున్నట్లు తెలిపారు.
మెడికల్ టూరిజం హబ్ గా తెలంగాణ..
మెడికల్ టూరిజంలో తెలంగాణ అత్యధిక లాభం పొందుతుందన్నారు. తెలంగాణలో అద్భుతమైన ఆసుపత్రులు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ ఒక మెడికల్ హబ్ గా మెడికల్ టూరిజానికి పెద్ద పీట వేయనున్నామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డయాలసీస్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. కేన్సర్ సెంటర్లను కూడా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఆయుష్ భారత్ బడ్జెట్ ను కూడా పెంచార్ననారు. ప్రతి సీనియర్ సిటిజన్ లను ఈ పథకం కింద తీసుకొచ్చారు. కాబట్టి 25 శాతం నిధులు పెంచార్నన్నారు. పేదవారికి ఇస్తున్న ఉచిత బియ్యం కోసం రూ. 2 లక్షల కోట్లకు పెంచారన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందజేస్తున్నామని తెలిపారు. దీంతోపాటు జల్ జీవన్ మిషన్,కిసాన్ సన్మాన్ నిధి కింద అందే నిధులతోనూ లాభం చేకూరుతుందన్నారు.
సాంకేతిక విద్యవైపు అడుగులు..
ఎడ్యుకేషన్ రంగం సాంకేతిక వృద్ధి దిశగా సాగుతుందన్నారు. 50వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కు అదనంగా మిగిలిన అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ప్రభుత్వ పాఠశాలల్లో బ్రాండ్ బ్యాండ్ కూడా అందుబాటులో రానుందన్నారు. భారతీయ భాష రీజినల్ ల్యాంగ్వేజ్ లో వస్తాయన్నారు. అన్ని అంగన్ వాడీసెంటర్ ఇన్ ఫ్రాస్ర్టక్చర్ ను మెరుగుపరిచామన్నారు. ఐఐటీ, మెడికల్ కాలేజీల్లో సీట్లను పెంచనున్నామని తెలిపారు. ఈ రకంగా బడ్జెట్ లో పొందుపరిచ్చిన 90 శాతానికి పైగా నిధుల వల్ల తెలంగాణకు కూడా లాభం చేకూరుతుందన్నారు.
తెలంగాణకు టెక్స్ టైల్, ఇండస్ర్టీయల్ హబ్ స్పెషల్ స్టేటస్లే..
అయినా కొందరు విపక్షాల నాయకులు తెలంగాణకు ఏమిచ్చారని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కొన్ని రాష్ర్టాలకు ప్రత్యేకమైన స్పెషల్ స్టేటస్ కింద కొన్ని ప్రాజెక్టులు ఇచ్చారని, పోలవరం, రైల్వే జోన్ లు ఇందులో భాగమేనన్నారు. అలాగే తెలంగాణ రాష్ర్టానికి దేశంలో ఎక్కాడా లేని విధంగా 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి, రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం, జవహార్, నవోదయ అత్యధిక విద్యాలయాల ఏర్పాటు కూడా స్పెషల్ స్టేటస్ లాగే అందజేశారని గుర్తుంచుకోవాలన్నారు. అన్ని రాష్ర్టాలకు ఈ రకమైన ప్రాజెక్టులు అందలేదని తెలుసుకోవాలన్నారు మెగాటెక్స్ టైల్స్ పార్కు, ఇండస్ర్టీయల్ హబ్ లాంటివి ఇలా వచ్చినవేనన్నారు. పథకాన్ని, అవసరాన్ని బట్టి తెలంగాణకు అన్ని రకాలుగా ప్రధాని నరేంద్ర మోదీ సహాయ సహకారాన్ని అందజేస్తున్నారని విపక్షాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి చెప్పారు. అంతిమంగా ప్రధానమంత్రి తెలంగాణకు వస్తే ఏనాడు ఒక్క బీఆర్ఎస్ నాయకులు కలవలేదని, ఇప్పుడు ఎం అడుగుతారని, ప్రశ్నిస్తారని కిషన్ రెడ్డి నిలదీశారు.