తొక్కిసలాట.. కరూర్ కు రిటైర్డ్ న్యాయమూర్తి
Stampede.. Retired judge to Karur
చెన్నై: కరూర్ తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య విచారణ కమిషన్ రిటైర్ న్యాయమూర్తి అరుణ జగదీశన్ తమిళనాడు తిరుచ్చికి చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం అక్కడి నుంచి కరూర్ కు రోడ్డు మార్గం ద్వారా వచ్చారు. ఈ నేపథ్యంలో ఆమెను మీడియా పలు ప్రశ్నలను సంధించింది. న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఘటన విచారకరమన్నారు. భవిష్యత్ లో ఇలాంటి లోపాలు జరగకుండా ఉండేందుకు ఏం చేయాలనేదే కమిషన్ ముఖ్యోద్దేశ్యమన్నారు. అవసరమైన పరిష్కార మార్గాలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పిస్తామన్నార. ప్రస్తుతం జరిగిన ఘటన ప్రాంతాన్ని సందర్శించి బాధితులను కలుసుకుంటానని చెప్పారు. ఇలాంటి దురదృష్టకర ఘటనలు పునరావృతం కాకుండా దర్యాప్తు నివేదికను అందజేస్తానని చెప్పారు.