తొక్కిసలాట ఎఫ్​ ఐఆర్​ బహిర్గతం

41 మంది మృతికి విజయ్​ కారణం

Sep 29, 2025 - 18:28
 0
తొక్కిసలాట ఎఫ్​ ఐఆర్​ బహిర్గతం

చెన్నై: కరూర్​ తొక్కిసలాట ఎఫ్​ ఐఆర్​ కాపీలోని వివరాలు సోమవారం వెల్లడయ్యాయి. ఇందులో పోలీసులు నటుడు విజయ్​ పై ఆరోపణలు చేశారు. టీవీకే చీఫ్​, నటుడు విజయ్​ 41మంది మృతికి, పలువురి గాయాలయ్యేందుకు కారకులన్నారు. విజయ్​ ఉద్దేశ్యపూర్వకంగానే రాజకీయ అధికారాన్ని ప్రదర్శించడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు ఆరోపించారు. తొలి ర్యాలీకి ఉదయం 9 గంటలకు చేరుకోవాల్సి ఉండగా, 11 గంటలకు చేరుకున్నారని, కరూర్​ ర్యాలీకి మధ్యాహ్నం చేరుకోవాల్సి ఉండగా 7 గంటల వరకు చేరుకోలేదన్నారు. ఫలితంగా జనసమూహం ఎక్కువైందన్నారు. అనవసర అంచనాలతో ఆలస్యంగా వచ్చి ప్రసంగించారన్నారు. పైగా రోడ్​ షో కోసం ఎటువంటి అనుమతి తీసుకోలేదన్నారు. పైగా జనసమూహానికి ఆహారం, నీరు, సౌకర్యాల కొరత హెచ్చరికలను పట్టించుకోలేదన్నారు. ప్రచార బస్సును ఎక్కడపడితే అక్కడే జన సమూహం మధ్య నిలిపివేశారని ఎఫ్​ ఐఆర్​ లో పోలీసులు పదునైన ఆరోపణలు చేశారు. కాగా టీవీకే కోర్టులో దాఖలు చేసిన పిటిషన్​ లో తొక్కిసలాటను రాజకీయ కుట్రగా పేర్కొన్నారు. పదేపదే ర్యాలీకి అనుమతి కోరినా ప్రభుత్వం నిరాకరించారని టీవీకే ప్రధాన కార్యదర్శి అధవ్​ అర్జున్​ మద్రాస్​ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. పైగా జనం ఎక్కువగా ఉండని, విద్యుత్​ కనెక్షన్లు కూడా లేని ప్రాంతంలో అనుమతినిచ్చారని, పోలీసు సిబ్బందిని మోహరించలేదని పలు ఆరోపణలు సంధించారు. తొక్కిసలాటకు అధికార పార్టీ సభ్యులే కుట్ర పన్నారని ఆరోపించారు. 
కాగా , టీవీకే కార్యకర్తల మధ్య పలు ప్రాంతాల్లో బాహాబాహీ నెలకొంది. తొక్కిసలాటకు కారణం మీరంటే మీరని ఒకరినొకరు కొట్టుకున్నారు. దీంతో పోలీసులు లాఠీలకు పని కల్పించారు.