పాట్నా: దీపావళి, ఛత్ కు ముందు బిహార్ లో ఏడు కొత్త రైళ్లు పట్టాలెక్కాయి. ఇందులో మూడు అమృత్ భారత్ రైళ్లు కూడా ఉన్నాయి. సోమవారం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి పలు రైళ్లను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. రైళ్లను ప్రారంభించిన విషయాన్ని డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి మీడియాతో పంచుకున్నారు. రాష్ర్ట ప్రజలకు సులభమైన, వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుందన్నారు. గతంలో బిహార్ రైల్వే బడ్జెట్ రూ. 1,000 కోట్లుగా ఉండేదని, ప్రధాని మోదీ నాయకత్వంలో రూ. 10,000 కోట్లకు పెరిగిందన్నారు. రాష్ర్ట ప్రజలకు ప్రయోజనం చేకూర్చే సమగ్రమైన, దార్శనిక విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మనముందు ఉంచారని సంతోషం వ్యక్తం చేశారు.
ప్యాసింజర్ రైళ్లు..
– రైలు నెం. 75271/75272 నవాడా-–పాట్నా, వారానికి 6 రోజులు నడుస్తుంది. రైలు నంబర్ 75273/75274 ఇస్లాంపూర్-–పాట్నా వారానికి 6 రోజులు నడుస్తుంది. రైలు నంబర్ 53201/53202 పాట్నా–-బక్సర్ వారానికి 6 రోజులు నడుస్తుంది. రైలు నం. 53203/53204 ఝఝా-దానాపూర్-–ఝఝా ఫాస్ట్ ప్యాసింజర్ వారానికి 6 రోజులు నడుస్తుంది.
అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్..
రైలు నెం. 15293/15294 ముజఫర్‌పూర్-–చర్లపల్లి, రైలు నం. 19623/19624 మడోర్-–దర్భంగా-, రైలు నం. 15133/15134 ఛప్రా-–ఆనంద్ విహార్- పలు స్టేషన్ల మీదుగా నడవనున్నాయి.