కీవ్​ పై విరుచుకుపడ్డ రష్యా

Russia lashes out at Kiev

Sep 28, 2025 - 18:43
 0
కీవ్​ పై విరుచుకుపడ్డ రష్యా

500 డ్రోన్లు, 40 క్షిపణులతో దాడులు
నలుగురు మృతి, 10మందికి గాయాలు

కీవ్​: ఉక్రెయిన్​ రాజధాని కీవ్​ పై రష్యా 500 డ్రోన్లు, 40కి పైగా క్షిపణులతో దాడులకు దిగింది. దీంతో ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రజలంతా ఆయా చోట్ల బంకర్లలో తలదాచుకునేందుకు పరుగులు తీశారు. ఆదివారం ఉదయం 6 గంటలకు ఈ దాడులు జరిగాయని కీవ్​ సైనిక పరిపాలనాధికారి తైమూర్​ తకాచెంకో ప్రకటించారు. ఈ దాడుల్లో నలుగురు మృతి చెందారని, 10 మంది గాయపడ్డారని తెలిపారు. దీంతో పోలాండ్​ గగనతలాన్ని మూసివేశారని పేర్కొన్నారు. కీవ్​ పై దాడికి ప్రతిస్పందనగా పోలాండ్​ తన వైమానిక దళ జెట్​ లను మోహరించింది. పలు స్థానిక మీడియా వార్తల ప్రకారం రష్యా డ్రోన్లు, యుద్ధవిమానాలు, రాకెట్ల శబ్ధాలు ప్రతిధ్వనించాయి. దీంతో ఉక్రెయిన్​ వ్యాప్తంగా అలర్ట్​ లో ఉండాలని ప్రకటించారు. ప్రజలు భూగర్భ రైల్వే స్టేషన్లను ఆశ్రయించారు. కాగా ఈ దాడులపై ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు.  మాస్కో దాడులను కొనసాగిస్తూ అమాయక ప్రజల ప్రాణాలను బలిగొనాలని కోరుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ఒత్తిడికి కూడా లొగ్గకపోతే పోరాటం కొనసాగిస్తామన్నారు.