అగ్నిప్రమాదం పుకార్లు రైలు నుంచి దూకి ఆరుగురు మృతి

Rumors of a fire, six people died by jumping from the train

Jan 22, 2025 - 18:55
 0
అగ్నిప్రమాదం పుకార్లు రైలు నుంచి దూకి ఆరుగురు మృతి

10 మందికి తీవ్ర గాయాలు
మృతుల సంఖ్య పెరిగే అవకాశముందున్న డీఎం
రైలు చక్రాల నుంచి వచ్చిన నిప్పు రవ్వలనే అగ్నిప్రమాదంగా భావించి హాహాకారాలు 
అలజడితో రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు
ఎదురుగా వస్తున్న మరో రైలు ఢీ కొనడంతో ప్రమాదం

ముంబాయి: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. రైలులో మంటలు వ్యాపించాయని పుకార్లు వ్యాపించడంతో హఠాత్తుగా పలువురు ప్రయాణికులు రైలు నుంచి దూకారు. దీంతో ఎదురుగా వస్తున్న మరో రైలు ఢీకొట్టి ఆరుగురు చనిపోయారు. బుధవారం సాయంత్రం జల్గావ్​  నుంచి పుష్పక్​ ఎక్స్​ ప్రెస్​ పరండా రైల్వే స్టేషన్​ సమీపంలోకి వస్తోంది. ఈ లోపు మంటలంటుకున్నాయని హాహాకారాలు మొదలయ్యాయి. దీంతో ప్రయాణికులు చైన్​ ని లాగారు. రైలు ఆగిఆగగానే ప్రయాణికులు రైలు దిగారు. ఎదురుగా వస్తున్న కర్ణాటక ఎక్స్​ ప్రెస్​ రైలు పలువురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 8 నుంచి 10 మందికి గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. క్షతగాత్రులను ప్రైవేటు వాహనాల్లో ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదంపై విభిన్న వాదనలున్నాయి. బ్రేకులు వేయడంతోనే చక్రాల నుంచి నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయని, మంటలు అంటుకున్నట్లుగా భావించారని దీంతో హాహాకారాలు చేశారని మరింత ఆందోళన చెలరేగి బోగీలోని ప్రయాణికులు చైన్​ ను లాగారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని డిజాస్టర్​ రెస్క్యూ టీమ్​ పంపామని డీఎం ఆయుష్​ ప్రకటించారు.