ఢిల్లీ సమరానికి సై!

Ready to fight in Delhi!

Feb 4, 2025 - 18:29
 0
ఢిల్లీ సమరానికి సై!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశ రాజధానిలో ఎన్నికల సమరానికి ప్రధాన పార్టీలు సై కొడుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ 70 స్థానాలకు గాను బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ 68 స్థానాలలో పోటీ చేస్తుండగా, ఆప్​ 70, కాంగ్రెస్​ 70, బీఎస్పీ 70, ఎన్సీపీ (శరద్​ పవార్​) 30 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎఐఎంఐఎం 12 స్థానాలు, సీపీఎం, సీపీఐ ఎంఎల్​ చెరో రెండు స్థానాల్లో పోటీకి దిగాయి. 

కాగా ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల విభాగం భారీ ఏర్పాట్లను చేసింది. 1.50 లక్షల మందిని ఎన్నికల విధులకు కేటాయించింది. 

కాగా లోక్​ సభ ఎన్నికల్లో ఆప్​, కాంగ్రెస్​ లు ఏడు స్థానాల్లో కలిసి పోటీ చేశాయి. బీజేపీ సింగిల్​ గానే రంగంలోకి దిగి క్లీన్​ స్వీప్​ చేసింది. బీజేపీకి 54.7 శాతం ఓట్లు రాగా, ఆప్​, కాంగ్రెస్​ లకు కలిపి 43.3 శాతం ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 54 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యంత భారీ ఓటింగ్​ నమోదైంది. ఈ లెక్కన బేరీజు వేసుకుంటే బీజేపీకి ప్రజామద్ధతు భారీగా పెరిగిందనేది స్పష్టం అవుతుంది. ఈ ఎన్నికల్లో పేరుకే ట్రయాంగిల్​ పోటీ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్న నిజమైన పోటీ మాత్రం బీజేపీ, ఆప్​ మధ్యేనని ఓటర్లు తమ మనోగతాన్ని మీడియాతో చెబుతుండడం గమనార్హం.