రాహుల్ అనుచిత వ్యాఖ్యల కేసు వాయిదా
Rahul's inappropriate comments case adjourned

లక్నో: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యల కేసు జనవరి 30కి వాయిదా పడింది. యూపీలోని సుల్తాన్ పూర్ ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో బుధవారం ఈ కేసుపై కోర్టు ఇరుపక్షాల వాదనలు వినాల్సి ఉంది. కాగా కోర్టులో న్యాయవాదుల నిరసన నేపథ్యంలో కేసు విచారణ వాయిదా పడింది. 2018 ఆగస్ట్ 4న పార్లమెంట్ లో కేంద్రమంత్రిపై అనుచిత వ్యాఖ్యలపై కోత్వాలీ దేహత్ పోలీస్ స్టేషన్‌కు చెందిన హనుమాన్‌గంజ్ నివాసి, మాజీ జిల్లా సహకార బ్యాంకు ఛైర్మన్, బీజేపీ నాయకుడు విజయ్ మిశ్రా రాహుల్ గాంధీపై పరువు నష్టం ఫిర్యాదు చేశారు.