నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా శిరీష్ చంద్ర ముర్మూ నియమితులయ్యారు. మూడేళ్ల కాలానికి ఆయన నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ సోమవారంఆమోదం తెలిపింది. శిరీష్ చంద్ర ముర్మూ ఎం. రాజేశ్వర్ రావు స్థానంలో రానున్నారు. ముర్మూ అక్టోబర్ 9న లేదా బాధ్యతలు స్వీకరిచాక మూడేళ్ల కాలంపాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. 1934 ఆర్బీఐ చట్టం ప్రకారం కేంద్ర బ్యాంకుకు (ఆర్బీఐ) నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉండాలి. ఇద్దరు స్వంత స్థాయి నుంచి ఒకరు వాణిజ్య బ్యాంకింగ్ రంగానికి, ద్రవ్య విధాన విభాగనికి అధిపతిగా మరో ఆర్థిక వేత్త ఉండాలి.
ప్రస్తుతం టి. రబీ శంకర్ విస్తృతశ్రేణి కార్యాచరణ, సాంకేతిక ఆధారిత విభాఆలను పర్యవేక్షిస్తారు. స్వామినాథన్ జానకిరామన్ వినియోగదారుల కేంద్రీకృత ప్రాంతాలకు బాధ్యత వహిస్తారు. పూనమ్ గుప్తా స్థూల ఆర్ఇక విధానం, వ్యూహాత్మక కమ్యూనికేషన్లకు బాధ్యత వహిస్తారు.