ఆసియాకప్​ తో పాక్​ పరార్​!

Pakistan escapes from Asia Cup!

Sep 29, 2025 - 16:14
 0
ఆసియాకప్​ తో పాక్​ పరార్​!
ఐసీసీకి ఫిర్యాదు చేయనున్న బీసీసీఐ
పాక్​ విజయమంటూ సిగ్గులేని పోస్టు
దుబాయ్​: ఆసియా కప్​ ​–2025 విజయం అనంతరం పీసీబీ చీఫ్​ మొహ్సిన్​ నఖ్వీతో భారత్​ క్రీడాకారులు కప్​ తీసుకునేందుకు నిరాకరించారు. మరేవరితోనైనా అందించాలన్నారు. ఈ నేపథ్యంలో నఖ్వీ ఆసియాకప్​ ను తన అనుచరులతో పంపించి, తాను వెనుదిరిగి చూడకుండా వెళ్లారు. సిగ్గులేకుండా పాక్​ ఆసియాకప్​ లో విజయం సాధించిందని పోస్ట్​ చేశారు. కాగా ఈ పరిణామంపై ఐసీసీలో పీసీబీపై ఫిర్యాదు చేయనున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.
 
కాగా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్​ లో చివరికి భారత్​ గెలుపొందడంతో పాక్​ కు చుక్కలు కనిపించాయి. అనంతరం భారత క్రీడాకారులు కరచాలనం చేయకపోవడం, ఆసియా కప్​ ను పీసీబీ చీఫ్​ తో తీసుకోకపోవడం, మరెవరి ద్వారానైనా తీసుకుంటామని తెగేసి చెప్పడంతో పాక్​ కు ఈ పరిణామాలు శరాఘాతంగా మారాయనే చెప్పాలి.
 
కాగా మ్యాచ్​ గెలిచిన అనంతరం జరిగిన ప్రెజెంటేషన్​ కార్యక్రమం 1.5 గంటలు ఆలస్యమైంది. పాక్​ క్రీడాకారులు డ్రెస్సింగ్​ రూమ్​ లోకి వెళ్లి ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆలస్యమైంది. తటస్థ కార్యనిర్వాహకుడు ఇతర ట్రోఫీలను భారత జట్టుకు అందించారు. అంతకు ముందే నఖ్వీ గబగబా మైదానం నుంచి పారిపోయాడు.