బీజేపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
PM Modi inaugurates new BJP office
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రాజధాని ఢిల్లీలో బీజేపీ నూతన కార్యాలయ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. సోమవారం ప్రారంభించిన ఈ భవనం రాజధానిలో 17వది. భవన నిర్మాణానికి రూ. 2.23 కోట్ల ఖర్యయ్యింది. కొత్త కార్యాలయం జాతీయ కార్యాలయానికి ఆనుకొని ఉంది. రాజధానిలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్ లో ఈ కార్యాలయాన్ని మోదీ ప్రారంభించగా, ఆయన వెంట కేంద్రమంత్రి జేపీ నడ్డా, సీఎం రేఖా గుప్తా తదితరులున్నారు.
ప్రత్యేకతలు..
కొత్త కార్యాలయం 825 చ.మీ. స్థలంలో, 30వేల చ.అ. విస్తీర్ణంలో ఉంది. ఐదు అంతస్థులుగా నిర్మించగా వాహనాల పార్కింగ్ కు రెండు బేస్మెంట్ లు నిర్మించారు. ప్రవేశద్వారం వద్ద దక్షిణాది భారత నిర్మాణ శైలిని పోలి ఉన్న పొడవాటి స్తంభాలున్నాయి. ఈ కార్యాలయాన్ని పర్యావరణ అనుకూలంగా, ఆధునిక సౌకర్యాలతో రూపొందించారు. గ్రౌండ్ ఫ్లోర్ లో కాన్ఫరెన్స్ రూమ్, రిసెప్షన్, క్యాంటీన్ ఉండగా, మొదటి అంతస్థులో 300మంది కూర్చునే సామర్థ్యం గల ఆడిటోరియం ఉంది. ఢిల్లీ యూనిట్ లోని వివిధ విభాగాలను రెండు అంతస్తులో, పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శుల కార్యాలయాలు మూడో ఫ్లోర్ లో ఉన్నాయి. పై అంతస్తులో బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి కార్యాలయాలు, ఎంపీలు, రాష్ర్ట యూనిట్ ఇన్ చార్జీల కోసం గదులున్నాయి. 2023 జూన్ 9న కార్యాలయానికి భూమి నిర్వహించారు.