ప్రజలు దేవుళ్లు.. 140 కోట్లమంది తన రిమోట్ కంట్రోల్
రూ. 18,530 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభం, శంకుస్థాపనలు
పాక్ ఎజెండాను మోస్తున్న కాంగ్రెస్
చొరబాటుదారులపై సీఎం శర్మ చర్యలు భేష్
ఆ భూముల్లో యువరైతుల వ్యవసాయం కోసం ప్రాజెక్టుల రూపకల్పన
డీస్ఫూర్: ప్రజలే తన దేవుళ్లు, నేను శివుని భక్తుడిని, నాపై ఎన్ని తిట్లను ప్రయోగించినా మింగేస్తాను. కానీ దేశాన్ని, దేశ ప్రజలను అవమానిస్తే ఎంతమాత్రం సహించేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 140 కోట్ల మంది ప్రజలే తన రిమోట్ కంట్రోల్ అన్నారు. తన ఆత్మ స్వరం మీ వద్దే వస్తుందని అన్నారు. మేడ్ ఇన్ ఇండియా వస్తువులనే కొనాలని పిలుపునిచ్చారు. భూపేన్ హజారికాను కూడా కాంగ్రెస్ విమర్శిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సైనికులపై ప్రశ్నలు లేవనెత్తుతు పాక్ కు కాంగ్రెస్ వత్తాసు పలుకుతుందని మండిపడ్డారు. అసోం ప్రజలు రానున్న పండుగ సమయాల్లో ‘మేక్ ఇన్ ఇండియా’ వస్తువులనే కొనాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధిలో అసోం పాత్ర గణనీయంగా ఉందన్నారు. అక్రమ చొరబాటుదారులపై సీఎం శర్మ ఉక్కుపాదం మోపుతున్నారని, దీంతో అసోం వాసుల హక్కులను కాపాడుతున్నారని ప్రశంసించారు. అక్రమవలసదారుల చేతుల్లో కబ్జాలకు గురైన భూములన్నీ ఇప్పుడు స్థానిక అసోం వాసులకే ఉపయోగపడతాయన్నారు. కామాఖ్య దేవి ఆశీస్సులతో ఆపరేషన్ సిందూర్ ను విజయవంతం చేసి పాక్ కు బుద్ధి చెప్పామన్నారు. పాక్ ఎజెండాను కాంగ్రెస్ మోస్తూ దేశ ప్రజలను కించపరుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
భూపేన్ పై కాంగ్రెస్ వ్యాఖ్యలు.. ప్రజలు ఆలోచించాలి..
ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ అసోం రెండు రోజుల పర్యటనలో భాగంగా దరాంగ్ చేరుకున్నారు. రూ. 18,530 కోట్లతో ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ధి పనులు, ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మెడికల్ కాలేజ్ ఆసుపత్రి, జీఎన్ ఎమ్ స్కూల్, బీఎస్సీ నర్సింగ్ కాలేజీలను ప్రారంభించారు. మంగళ్ డోయ్, గోలాఘాట్ లోని నుమాలిఘర్ రిఫైనరీని మోదీ సందర్శించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. భూపేన్ హజారికాను ఏనాడన్న కాంగ్రెస్ గౌరవించిందా? అసోం ప్రజలు ఆలోచించాలన్నారు. వారిదంతా దేశవిచ్ఛిన్న ఏజెండానే అని ఆరోపించారు. అక్రమ చొరబాటుదారులకు, దేశ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ పోషకురాలిగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత్ సైన్యానికి మద్ధతు ఇచ్చే బదులు పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులకు మద్థతు ఇచ్చిందని మండిపడ్డారు. చొరబాటుదారులను, వారిని రక్షించే వారిని దేశం, తాను క్షమించబోమని, అసోం వారసత్వాన్ని కాపాడుకుంటామని చెప్పారు. ఒక్క గజం భూమి కూడా చొరబాటుదారులను ఆక్రమించుకోనీయమని స్పష్టం చేశారు. అసోం ప్రజలు కాంగ్రెస్ కు దూరంగా ఉండాలన్నారు. మన విశ్వాసాలను, పేద, గిరిజన ప్రజల శ్రమ, భూములను దోచుకునే పార్టీ ఇదన్నారు. తిరిగి తీసుకున్న భూమిలో నేడు అక్కడి రైతుల కోసం ఒక ప్రాజెక్టు ఏర్పాటు చేయబోతున్నట్లు మోదీ తెలిపారు. ఆ భూముల్లో యువత వ్యవసాయ సైనికులు మారి వ్యవసాయం చేస్తారని చెప్పారు.
జీఎస్టీతో ఆర్థిక స్వావలంభన..
రాబోయేది పండుగల సమయమని అసోం ప్రజలు ఏదీ కొన్నా ‘మేడ్ ఇన్ ఇండియా’ స్వదేశీ వస్తువులనే కొనాలని పిలుపునిచ్చారు. దేశంలో తయారైన వస్తువుకే ప్రాధాన్యతనీయాలన్నారు. విదేశీ సంస్థ, పెట్టుబడిదారులెవరైనా సరే భారత్ శ్రమతో కూడుకొని తయారైన వస్తువును కొనుగోలు చేసి దేశాభివృద్ధికి సహకరించాలన్నారు. రాబోయే 50 అభివృద్ధిని ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకువెళుతున్నామని చెప్పారు. దేశ ప్రజలు, వ్యాపారులు, పరిశ్రమలు అన్ని వర్గాలకు మేలు చేకూర్చేందుకు జీఎస్టీని నాలుగు భాగాల నుంచి రెండుభాగాలకు కుదిరించామన్నారు. అందులోనూ విద్య, వైద్య, ఆరోగ్య, వ్యవసాయం, నిత్యావసర వస్తువుల కొనుగోళ్లకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. వాటిపై పన్ను గణనీయంగా తగ్గించామని, చాలావాటిపై పన్ను విధించలేదన్నారు. ఇది దేశ ప్రజలను ఆర్థిక స్వావలంభన చేకూర్చే దిశలో పయనిస్తుందన్నారు.
65 ఏళ్లలో ఏం చేశారు.. ఈశాన్యాన్ని అంధకారంలో ముంచారు..
ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే వేగవంతమైన కనెక్టివిటీ అవసరమని అందుకే ఈశాన్య ప్రాంతాలపై దృష్టి పెట్టామని చెప్పారు. కాంగ్రెస్ ఆరుదశాబ్ధాల పాలనలో ఈశాన్య రాష్ర్టాలను అంధకారంలో ముంచిందని విమర్శించారు. 65ఏళ్లలో కాంగ్రెస్ మూడు వంతెనలు నిర్మిస్తే.. 10 ఏళ్లలో తమ ప్రభుత్వం ఆరు పెద్ద వంతెనలను నిర్మించిందని చెప్పారు. 21వ శతాబ్ధం ఇక ఈశాన్య ప్రాంతానిదే అన్నారు. ఇక్కడ గణనీయమైన మార్పులను, అభివృద్ధిని చేయడమే లక్ష్యంగా మోదీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి వీడియోను సీఎం శర్మ తనకు చూపారని ఇది తనకు బాధేసిందన్నారు. అసోం గొప్ప పుత్రుడు, గర్వకారణమైన మహోన్నతుడు భూపేన్ హజారికా అన్నారు. ఆయన్ను గౌరవించుకోవడం, పూజించుకోవడం మన కర్తవ్యమని మోదీ చెప్పారు.