తొక్కిసలాటపై.. పరామర్శకు ఎన్డీఏ బృందం ఏర్పాటు
NDA team formed to consult on stampede
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: తమిళనాడు కరూర్ టీవీకే ర్యాలీలో తొక్కిసలాట సందర్భంగా మృతి చెందిన, గాయపడిన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఎన్డీఏ ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు సోమవారం బృందం ఏర్పాటును కేంద్రమంత్రి జేపీ నడ్డా ప్రకటన విడుదల చేశారు. అనురాగ్ ఠాకూర్, తేజస్వి సూర్య, బ్రజ్ లాల్, అప్రాజిత సారంగి, రేఖా శర్మ, శ్రీకాంత్ షిండే, పుట్టా మహేష్ కుమార్ లున్నారు. ఈ కమిటీకి బీజేపీ ఎంపీ హేమమాలిని కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. కాగా తొక్కిసలాటలో మృతి చెందిన వారి సంఖ్య సోమవారానికి 41కి చేరుకుంది. 18 మంది మహిళలు, 10 మంది పిల్లలున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు జేపీ నడ్డా సంతాపాన్ని ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. కాగా సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కరూర్ పర్యటనలో ఉన్నారు.