ప్రధాని అభినందనలతో మరింత ఉత్సాహం

కెప్టెన్​ సూర్యకుమార్​ యాదవ్​

Sep 29, 2025 - 17:50
 0
ప్రధాని అభినందనలతో మరింత ఉత్సాహం

దుబాయ్​: ఆసియా కప్​ విజయం తరువాత ప్రధాని నరేంద్ర మోదీ అభినందించిన తీరు క్రికెట్​ టీంలో మరింత ఉత్సాహాన్ని నింపిందని జట్టు కెప్టెన్​ సూర్యకుమార్​ యాదవ్​ సోమవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. గేమ్​ ఫిల్డ్​ ను ఆపరేషన్​ సిందూర్​ తో పోల్చడం గర్వకారణమన్నారు. దేశ నాయకుడు స్వయంగా ముందడుగు వేసి తమను కీర్తించడం ఎంతో సంతోషకరమన్నారు. ఇది ఆటగాళ్లలో మరింత ప్రేరణను, స్వేచ్ఛను పెంపొందిస్తుందన్నారు. ప్రధాని ప్రేరణతోనే క్రీడాకారులు స్వేచ్ఛగా ఆడి విజయాన్ని సాధించగలిగామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఆయనే తొలి స్ర్టైక్​ తీసుకొని పరుగులు చేసినట్లుగా అనిపిస్తుందన్నారు. దేశం మొత్తం సంబురాలు చేసుకుంటున్న వేళ భారత్​ కు విజయంతో వెళ్లడం మరింత ప్రేరణగా నిలుస్తుందన్నారు. నఖ్వీ రాజకీయ పాత్ర, భారత వ్యతిరేక వ్యాఖ్యల కారణంగా ట్రోఫీని అంగీకరించదని అన్నారు.