మోదీ @ అరుదైన చిత్రాలు

Modi @ rare images

Sep 16, 2025 - 19:44
Sep 16, 2025 - 19:46
 0
మోదీ @ అరుదైన చిత్రాలు
నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు అధికారం పూర్తి చేసుకొని 74 నుంచి 75వ పడిలోకి అడుగిడబోతున్న ప్రధాని నరేంద్ర మోదీ అనేక అవార్డులు, రివార్డులే గాక ‘డైమండ్​ జూబ్లీ’ని జరుపుకోనున్నారు. సాధారణ టీ అమ్మే వ్యక్తి నేడు ప్రపంచానికి దశ, దిశ, నిర్దేశం చూపించే వ్యక్తిగా ఎదిగారు. ఆయన ప్రయాణమంతా ఓ సాధాసీదా వ్యక్తిలానే జరిగినట్లు కనిపించినా అనేక అవరోధాలు, అవాంతరాలు, ముళ్లకంచెలు, బాటలను అధిరోహించారు. ఇక ప్రధానమంత్రిగా ఎన్నికైన 11 ఏళ్ల కాలంలోనైతే సాక్షాత్తూ పలు ప్రపంచదేశాలతోపాటు, శత్రుదేశాలు, దేశంలో ఉన్న దేశవిచ్ఛిన్నకర పందికొక్కులు అనేక అవంతరాలను సృష్టించారు. అయినా ఏ మాత్రం మొక్కవోని ధైర్యంగా నేడు భారత్​ ను ప్రపంచదేశాల్లో అగ్రగామిగా నిలపాలన్న ఒకే ఒక లక్ష్యంతో ముందుకు సాగుతున్న మహానుభావుడు నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ఆయన అరుదైన చిత్రాలు.. 1970న గుజరాత్​ లోని వాద్​ నగర్​ లో దామోదర్​ దాస్​ మూల్చంద్​ మోదీ, తల్లి హీరాబెన్​ దంపతులకు జన్మించారు. 
 
1992 ఏక్తా యాత్ర సందర్భంగా నుదుటిపై తిలకం దిద్దుతున్న తల్లి హీరాబెన్​ 
 
ఎన్​ సీసీ క్యాడెట్ గా యవ్వనంలో..
 

సంఘర్ష్​ మా గుజరాత్​ పుస్తకం విడుదల సందర్భంగా మోదీ ప్రసంగం
 
2002లో రాజ్​ కోట్​ నుంచి గుజరాత్ అసెంబ్లీ ఉప ఎన్నికకు మోదీ నామినేషన్​
నరేంద్ర మోదీ వెనుక అమిత్​ షా, సీనియర్​ నాయకుడు ఎల్​ కే అద్వానీ (కూర్చొని)
 

వివేకానంద ప్రేరణలతో ప్రయాణానికి బయలుదేరే ముందు ప్రధాని నరేంద్ర మోదీ