సంగమ స్నానమాచరించిన భూటాన్​ రాజు వాంగ్​ చుక్​

King Wangchuck of Bhutan who took Sangam bath

Feb 4, 2025 - 13:36
 0
సంగమ స్నానమాచరించిన భూటాన్​ రాజు వాంగ్​ చుక్​

లక్నో: భూటాన్​ రాజు మహాకుంభ మేళాలో సీఎం యోగి ఆదిత్యనాథ్​ తో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించారు. మంగళవారం ఉదయం రాజు జిగ్మేఖేసర్​ నాంగ్యాల్​ వాంగ్​ చుక్​ రాకను సీఎం యోగి స్వాగతించారు. అనంతరం ఆయనతో కలిసి స్నానమాచరించారు. సంగం ఒడ్డున పావురాలకు ధాన్యం తినిపించారు. ఈ సందర్భంగా వాంగ్​ చుక్​ మాట్లాడుతూ.. ప్రయాగ్​ రాజ్​ త్రివేణి సంగమంలో స్నానమాచరించడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. భారత ప్రభుత్వానికి, సీఎం యోగికి ధన్యవాదాలు తెలిపారు. సోమవారమే వాంగ్​ చుక్​ ప్రయాగ్​ రాజ్​ విమానాశ్రయానికి చేరుకోగా సీఎం యోగి, అధికారుల బృంధం ఆయనకు ఘన స్వాగతం పలికింది. మంగళవారం ఉదయం పుణ్య స్నానాలకు ముందు త్రివేణి సంగమం వద్ద కళాకారులు రాజు వాంగ్​ చుక్​ కు స్వాగతం పలికారు.