జేఈఈ మెయిన్స్ రీ షెడ్యూల్
ఒక్క కేంద్రంలోనే సాంకేతిక సమస్యన్న ఎన్టీఎ

జనవరి 28, 29 తేదీన నిర్వహణ
త్వరలోనే అడ్మిట్ కార్డుల జారీ
బెంగళూరు: అత్యంత ప్రతిష్ఠాత్మకంగా బుధవారం నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్ష దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగియగా బెంగళూరులోని ఒక కేంద్రంలో సాంకేతిక సమస్య వల్ల నిలిచిపోయింది. దీంతో పరీక్షను మరోరోజు నిర్వహిస్తామని విద్యాశాఖాధికారులు ప్రకటించారు. ఈ కేంద్రంలో 114 మంది విద్యార్థులకు మరోమారు పరీక్షను నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఇందుకు సంబంధించి అధికారిక వెబ్ సైట్ ను ఈ కేంద్రంలో పరీక్ష రాయబోయే విద్యార్థులు సందర్శించి వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొంది. పరీక్షను 28, 29 జనవరికి రీ షెడ్యూల్ చేశామని ప్రకటించింది. ఈ తేదీలో పరీక్షకు అర్హులైన విద్యార్థులకు అడ్మిట్ కార్డులు జారీ చేస్తామని ఎన్టీఎ ప్రకటించింది.