అసోం ఆర్థిక వ్యవస్థకు జీఎస్టీ ఊతం!

GST is a boost to Assam's economy!

Sep 29, 2025 - 17:08
 0
అసోం ఆర్థిక వ్యవస్థకు జీఎస్టీ ఊతం!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: జీఎస్టీ సంస్కరణలో అసోంలోని టీ, పట్టు, హస్తళలు, పర్యాటక రంగం, వ్యవసాయ ఉత్పత్తులకు మేలు చేకూరింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించింది. అసోం తేయాకు పరిశ్రమలో 6.84 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. జీఎస్టీని 5 శాతానికి తగ్గించడం వల్ల తేయాకు ధరలు దాదాపు 11 శాత మేర తగ్గాయి. 2024లో 255 మిలియన్​ కిలోల తేయాకును ఎగుమతి చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం చేసిన సంస్కరణలు మరింత ఎగుమతులకు ఆస్కారం కల్పించాయి. మరోవైపు కార్మికుల వేతనాలు కూడా పెరగనున్నాయి. అసోంలో నేత కార్మికుల్లో 12.83 లక్షల మంది నేత కార్మికులు, 12.46 లక్షల మగ్గాలు పట్టు వస్త్ర, చేతిపనుల పరిశ్రమతో ముడిపడి ఉన్నాయి. దేశంలోని ముగా పట్టు ఉత్పత్తిలో అసోం 95 శాతం వాటాను అందిస్తుంది. జీఎస్టీని తగ్గించడం ద్వారా ఈ ఉత్పత్తుల ధర దాదాపు 6.25 శాతం తగ్గుతుంది. ఇది నేత కార్మికులు తమ ఉత్పత్తులకు మంచి ధరలను పొందడానికి సహాయపడటమే గాక ఎగుమతులను పెంచనుంది. పన్ను తగ్గింపు కారణంగా సాంస్కృతిక గుర్తింపు కలిగిన ఉత్పత్తులు కూడా ఎక్కువ అమ్మకాలను చవిచూడనున్నాయి. అసోం జాబి, ఆశారికండి టెర్రకోట, మిషింగ్​ హ్యాండ్లూమ్​, పానీ మెటేకా, బిహు ధోల్​ వంటి ఉత్పత్తులు కూడా ప్రయోజనం పొందుతాయి. అంతేగాక పర్యాటక రంగంలో కాజీరంగ బ్రహ్మపుత్ర టూరిస్ట్ సర్క్యూట్, మజులి, పోబిటోరా, గౌహతి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. 2015–-16లో 6.51 లక్షల పర్యాటక సంబంధిత ఉద్యోగాలు ఉన్నాయి. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రూ. 7,500 వరకు రేట్లు ఉన్న హోటల్ గదులపై జీఎస్టీ రేట్లు 5 శాతానికి తగ్గాయి. దీనివల్ల పర్యాటకులకు వసతి సదుపాయాలు మరింత మెరుగయ్యాయి. 
ఇక వ్యవసాయ ఉత్పత్తులకు జీఎస్టీ సంస్కరణలు మరింత ఊతం కల్పించయి. ప్రాసెస్​ చేసిన ఉత్పత్తులు చౌకగా మారడంతోపాటు రైతులకు అధిక ధరలు లభించనున్నాయి. గౌహాతి, నల్బరి, బర్పేట, దరంగ్​ వంటి ప్రాంతాలలో జీఐ జోహా బియ్యం 5 శాతం శ్లాబులో ఉంది. ఈ రకమైన వ్యవసాయ ఉత్పత్తులు యూరప్​, వియత్నం, మధ్య ప్రాచ్యంలో ఎగుమతి కానున్నాయి. మొత్తానికి జీఎస్టీ  సంస్కరణలు అసోం ఆర్థిక రంగానికి మరింత భరోసా, భద్రతను పెంచనున్నాయి, బలోపేతం చేయనున్నాయి.