ఆశీర్వదించిన ప్రకృతి
రోడ్డు మార్గంలో మోదీ
ఇంఫాల్: ఓ వైపు భారీ వర్షం.. మరోవైపు మణిపూర్ లో హింస బాధితులను ఎలగైనా కలవాలి, వారి ఇతిబాధలను తెలుసుకోవాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం ముందు ప్రకృతి సైతం ఆశీర్వాదం ఇచ్చినట్లుగా తలొగ్గింది. శనివారం మణిపూర్ పర్యటన సందర్భంగా భారీ వర్షాల కారణంగా చురచంద్ పూర్ ప్రధాని పర్యటనకు అడ్డంకిగా మారింది. దీంతో ఇంఫాల్ వరకు విమానంలో చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ ఆ తరువాత 65 కి.మీ. గంటన్నర ప్రయాణాన్ని వాహనంలో కొనసాగించారు. ప్రయాణంలో మణిపూర్ ప్రజలకు సెల్యూట్ చేస్తూ ముందుకు కొనసాగారు. పెద్ద వర్షంలో కూడా ప్రజలు తనపై ఉన్న ప్రేమాభిమానాలతో వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. హెలికాప్టర్ ఎగరకపోవడమే మంచిదని, ఇక్కడి ప్రజల అభిమానాన్ని, వారి హృదయాల్లో తనకు ఉన్న స్థానాన్ని గుర్తించగలిగానని అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.