370 మార్చే ప్రసక్తే లేదు

పునరుద్ఘాటించిన కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి

Oct 11, 2024 - 17:15
 0
370 మార్చే ప్రసక్తే లేదు
  • ఓట్ల ట్యాంపరింగ్​ పై కాంగ్రెస్​ పై ఈసీ కన్నెర్ర
  • 29మంది హిందువులను గెలిపించుకున్నాం
  • సంఘవిద్రోహ శక్తులను ఉపేక్షించం
  • జమ్మూలో హస్తానికి ఒక్కటే
  • పాక్​ కు చైనా సహకారం
  • తెలంగాణలో తగ్గిన పాక్​ సానుభూతి పరుల సంఖ్య
  • మోదీ పాలనలో పదేళ్లలోనే బలమైన భారత్​
నా తెలంగాణ, హైదరాబాద్​: ఆర్టికల్​ 370ని మార్చే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్​ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి పునరుద్ఘాటించారు. శుక్రవారం మంత్రి కిషన్​ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్టికల్​ 370ని ముట్టుకునే సాహసం కాంగ్రెస్​ చేయడం లేదన్నారు. హరియాణాలో ఓట్ల ట్యాంపరింగ్​ జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్​ నేతలు మరి జమ్మూలో ఎందుకు జరగలేదో చెప్పాలని నిలదీశారు. ఈసీ కాంగ్రెస్​ ను తీవ్రంగా మందలించిందని మంత్రి చెప్పారు. జమ్మూలో హస్తం పార్టీకి కేవలం ఒక్క సీటు మాత్రమే వచ్చిందన్నారు. కశ్మీర్​ లోయలో బీజేపీకి అనుకూలంగా 90 శాతం ఓట్లు పోలైనా మెజార్టీ సీట్లు రాలేదన్నారు. 29 స్థానాల్లో హిందువులను గెలిపించుకోగలిగామని తెలిపారు. స్వాతంత్ర్యం సిద్ధించాక బీజేపీ ఇన్నిసీట్లను ఎప్పుడూ గెలవలేదన్నారు. జమ్మూకశ్మీర్​ లో సంఘవిద్రోహ చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం మంత్రి కిషన్​ రెడ్డి హెచ్చరించారు.
 
నోట్ల రద్దుతో దొంగనోట్లకు చెక్​..
జమ్మూకశ్మీర్​ లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం కొనసాగుతుందని తెలిపారు. దేశంలో ఉగ్రవాదం, మతకలహాలు తగ్గాయన్నారు. అదే సమయంలో తెలంగాణలోని నిర్మల్​, వరంగల్​, కామారెడ్డి, నిజామాబాద్​ వంటి ప్రాంతాల్లో పాక్​ సానుభూతి పరుల సంఖ్య తగ్గిందన్నారు. ఒకప్పుడు తెలంగాణలో ఏదో ఓ చోట మతకలహాలు, ఉగ్రదాడులు జరిగేవని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నోట్ల రద్దుతో పాక్​ నుంచి వచ్చే దొంగనోట్లకు చెక్​ పెట్టగలిగామన్నారు. చైనా పాక్​ కు అన్ని రకాల సహకారం అందజేస్తుందని ఆరోపించారు. గతంలో ఆయుధాలు కూడా అందించిన సందర్భాలు అనేకం ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం పాక్​ కు యూరప్​ దేశాలు కూడా సహకారం ఇవ్వడం లేదని తెలిపారు. ఈ చర్యలు భారత్​ సాధించిన అతిపెద్ద విజయంగా తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో బలమైన భారత్​ గా పదేళ్లలో నిలిచిందని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు.
 
అభివృద్ధి పనుల ప్రారంభాలు..
సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని బీద బస్తీ, నల్లగుట్ట, సీతాఫల్​ మండిలో శుక్రవారం తెలంగాణ రాష్​ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ ఓపెన్​ జిమ్​ ను ప్రారంభించారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి ధృఢమైన ఆరోగ్యానికి కసరత్తు  (ఫిట్​ నెస్​) ఎంతో ముఖ్యమన్నారు. మానవ జీవన శైలిలో ఫిట్​ నెస్​ ను భాగంగా చేసుకొని పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతోనే ఫిట్​ నెస్​ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి వివరించారు. 
 
నివాళులు..
భారతరత్న నానాజీ దేశ్‌ముఖ్‌, ప్రజా ఉద్యమ నాయకుడు జైప్రకాశ్​ నారాయణ్​ జయంతి సందర్భంగా వారికి నివాళులర్పించారు. వారి సేవలను స్మరించుకున్నారు. గ్రామీణ భారత్​ వ్యవసాయంపై లోతైన అవగాహన కోసం దేశ్​ ముఖ్​ చేసిన నిస్వార్థ సేవ ప్రతీ ఒక్కరిలోనూ స్ఫూర్తిని నింపిందన్నారు. ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత, ధైర్యం, భావజాలంతో సంపూర్ణ క్రాంతిని తీసుకువచ్చిన భారతరత్న బిరుదు సాధించిన జై ​ ప్రకాశ్​ నారాయణ్​ స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని కొనియాడారు.