14.5 పెరిగిన గృహ సంపద

అలియాంజ్​ గ్లోబల్​ వెల్త్​ రిపోర్ట్​ ప్రకటన

Sep 28, 2025 - 17:55
 0
14.5 పెరిగిన గృహ సంపద

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారతీయ గృహ సంపద 2024లో రికార్డు స్థాయిలో 14.5 శాతానికి పెరిగిందని అలియాంజ్​ గ్లోబల్​ వెల్త్​ రిపోర్ట్​ 2025 ఆదివారం ప్రకటించింది. ఇది ఏ ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కంటే అత్యుత్తమ పనితీరును కనబర్చిందని తెలిపింది. గత 8 ఏళ్లలో అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదు చేసిందని నివేదిక స్పష్టం చేసింది. భారత్​ లో వేగంగా పెరుగుతున్న మధ్యతరగతి సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందని స్పష్టం చేసింది. ఈ సర్వే నివేదికలను 60 దేశాలను ఒడబోసిన తరువాత చేపట్టారు. గత రెండు దశాబ్ధాల దేశ వాస్తవ తలసరి ఆర్థిక సంపద ఐదు రెట్లు పెరిగిందని సర్వేలో వెల్లడైంది. సెర్యూరిటీల వృద్ధి 28.7 శాతం, బీమా, పెన్షన్లు 19.7 శాతం, బ్యాంకు డిపాజిట్లు 8.7 శాతం పెరిగాయని తెలిపింది. కుటుంబాల పోర్ ఫోలియోలలో బ్యాంకు డిపాజిట్లు 54 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ద్రవ్యోల్బణం తరువాత ఆర్థిక ఆస్తులు 9.4 శాతానికి పెరిగాయి, దీంతో కొనుగోలు శక్తి కిందటిస్థాయిల కంఏ 40 శాతానికి పెరిగిందని తెలిపింది. పశ్చిమ ఐరోపాలో కొనుగోలు శక్తి 2019లో 2.4 శాతం తక్కువగా ఉందని వెల్లడించింది. 2024లో భారతీయుడి తలసరి నికర ఆర్థిక ఆస్తుల విలువ 2,818 (2,49,867.44)యూఎస్​ డాలర్లు. ఇది మునుపటి సంవత్సరం కంటే 15.6 శాతం ఎక్కువని నివేదిక స్పష్టం చేసింది. అదే సమయంలో అప్పుల వృద్ధి రేటు 12.1 శాతంగా ఉంది. గృహ రుణాలు జీడీపీలో 41 శాతానికి చేరాయి.