119మంది అక్రమ వలసదారులు వెనక్కు

అమెరికా నుంచి ఫిబ్రవరి 16న భారత్​ కు 

Feb 14, 2025 - 16:12
 0
119మంది అక్రమ వలసదారులు వెనక్కు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: అమెరికా నుంచి భారత అక్రమ వలసదారులతో మరో విమానం రాబోతుంది. ఫిబ్రవరి 15న 119మంది తో ఈ విమానం అమృత్​ సర్​ కు చేరుకోనుందని శుక్రవారం అధికార వర్గాలు వెల్లడించాయి. అక్రమ వలసదారుల విషయంలో భారత్​ స్పష్టమైన విధానంతో ఉందని మోదీ–ట్రంప్​ లు ప్రకటించిన నేపథ్యంలో ఇకపై అమెరికా అక్రమ భారతీయ వలసలను నిరోధించనున్నారు. గతంలో కూడా 104 మంది భారత్​ కు పంపించారు. అమెరికా వ్యాప్తంగా అక్రమంగా ఉంటున్న వారిలో భారతీయులు 20వేల మంది ఉన్నట్లు గుర్తించారు. ఇటీవల పార్లమెంట్​ లోనూ ఈ అంశాన్ని విదేశాంగ శాఖ మంత్రి ఎస్​.జై శంకర్​ లేవనెత్తారు. అక్రమ వలసదారులను అమెరికా వెనక్కుపంపడం ఇదే తొలిసారి కాదని, గత పదేళ్ల రికార్డులను వెల్లడించారు. అమెరికా కేవలం అక్రమంగా నివసిస్తున్న భారతీయులను మాత్రమే వెనక్కుపంపడం లేదని, అన్ని దేశాల వారిని వెనక్కి పంపిందని చెప్పారు. 
............